సత్తా చాటిన టాలీవుడ్ ..స్పందించిన కేటీఆర్
దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే జాతీయ చలన చిత్ర అవార్డు విజేతల వివరాలు నిన్న(శుక్రవారం) ప్రకటించబడ్డాయి. భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర అవార్డులను సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో పలు దక్షిణాది చిత్రాల హవా కొనసాగింది. టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర సత్తా దేశానికి తెలిసింది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి పలు సినిమాలకు గాను వేరు వేరు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. 'మహానటి' సినిమా ఉత్తమ చిత్రంగా సెలెక్ట్ కాగా, అదే సినిమాకు గాను ఉత్తమ హీరోయిన్ కేటగిరీలో కీర్తి సురేష్ అవార్డు దక్కించుకుంది. అదేవిధంగా రంగస్థలం, చిలసౌ, అ! చిత్రాలు వివిధ కేటగిరీల్లో అవార్డులు పొందాయి.

దీంతో టాలీవుడ్ చిత్రసీమ సహా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగు సినిమా సాధించిన ఘనత పట్ల గర్వంగా ఫీల్ అవుతోంది. ఈ మేరకు తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 66 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలకు పలు కేటగిరీల్లో అవార్డ్స్ రావడం, అరుదైన గౌరవం దక్కినట్లే. ఉత్తమ హీరోయిన్‌గా అవార్డు దక్కించుకున్న కీర్తి సురేష్‌కి, మహానటి టీంకి, డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి, నిర్మాత స్వప్న దత్‌కి, చి ల సౌ చిత్ర యూనిట్ కి, రంగస్థలం యూనిట్‌కి, అ! సినిమా యూనిట్ సభ్యులందరికీ నా ప్రత్యేక అభినందనలు అని తెలుపుతూ ట్వీట్ చేశారు కేటీఆర్.


Click it and Unblock the Notifications











