ఆర్టీసీ బస్సులో ‘భీష్మ’ పైరసీ మూవీ.. కేటీఆర్ రియాక్షన్ ఎలా ఉందంటే..
సినీ ఇండస్ట్రీలో పైరసీ అనేది కొరకరాని కొయ్యగా మారింది. సినీ ఇండస్ట్రీ సహా ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన మాత్రం అందరికీ షాకిచ్చింది. ఇటీవలే విడుదలైన భీష్మ సినిమా ఇంకా థియేటర్స్‌లో నడుస్తుండగానే తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం కలకలం రేపింది.
హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఓ టీఎస్ ఆర్టీసీ లగ్జరీ బస్సులో భీష్మ సినిమా ప్రదర్శించారు. అది చూసి షాకైన ఓ యువకుడు సదరు బస్సు, ఆ వీడియో తీసి ట్విట్టర్‌లో చిత్రయూనిట్‌కి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. దీంతో వెంటనే స్పందించిన నటుడు నితిన్ ఫిలించాంబర్‌లోని పైరసీ వ్యతిరేక విభాగంలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అలాగే, భీష్మ సినిమాను టీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారంటూ ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశాడు.
ఈ ట్వీట్ చూసి వెంటనే స్పందించిన కేటీఆర్.. బస్సుల్లో పైరసీ చిత్రాలు ప్రదర్శించకుండా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేయాలని తెలంగాణా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు సూచించారు. దీంతో ఈ పైరసీ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











