twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్టీసీ బస్సులో ‘భీష్మ’ పైరసీ మూవీ.. కేటీఆర్ రియాక్షన్ ఎలా ఉందంటే..

    |

    సినీ ఇండస్ట్రీలో పైరసీ అనేది కొరకరాని కొయ్యగా మారింది. సినీ ఇండస్ట్రీ సహా ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన మాత్రం అందరికీ షాకిచ్చింది. ఇటీవలే విడుదలైన భీష్మ సినిమా ఇంకా థియేటర్స్‌లో నడుస్తుండగానే తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం కలకలం రేపింది.

    హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఓ టీఎస్ ఆర్టీసీ లగ్జరీ బస్సులో భీష్మ సినిమా ప్రదర్శించారు. అది చూసి షాకైన ఓ యువకుడు సదరు బస్సు, ఆ వీడియో తీసి ట్విట్టర్‌లో చిత్రయూనిట్‌కి ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. దీంతో వెంటనే స్పందించిన నటుడు నితిన్ ఫిలించాంబర్‌లోని పైరసీ వ్యతిరేక విభాగంలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

     K. T. Rama Rao Reaction On Bheeshma piracy

    అలాగే, భీష్మ సినిమాను టీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారంటూ ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశాడు.
    ఈ ట్వీట్ చూసి వెంటనే స్పందించిన కేటీఆర్.. బస్సుల్లో పైరసీ చిత్రాలు ప్రదర్శించకుండా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేయాలని తెలంగాణా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు సూచించారు. దీంతో ఈ పైరసీ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారింది.

    English summary
    Nithiin's Bheeshma got huze success ay tollywood boxoffice. Now this movie piracy copy shows in TS RTC bus. On this issue Ktr reacted as.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X