ఎస్పీబాలు మరణంతో కుడిభుజం.. సిరివెన్నెల మృతితో ఎడమ భుజాన్ని కోల్పోయా.. కే విశ్వనాథ్ కంటతడి
మహ రచయిత, సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో యావత్ సంగీత ప్రపంచం మూగబోయింది. ఆయన ఇక లేరనే దుర్వార్తతో సినీ ప్రముఖులు తల్లడిల్లిపోతున్నారు. ఆయన మృతివార్తను జీర్ణించుకోలేకపోయారు. అయితే సిరివెన్నెల మరణవార్తపై స్పందిస్తూ గురు సమానులు, దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా సిరివెన్నెల, కే విశ్వనాథ్ కాంబినేషన్ గురించి. .

సిరివెన్నెలతో విశ్వనాథ్ సుదీర్ఘ ప్రయాణం
కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన జననీ జన్మభూమి, సిరివెన్నెలతో చెంబోలు సీతారామశాస్త్రి తన సినిమా కేరీర్‌ను ప్రారంభించారు. సిరివెన్నెల సినిమాతో ఆయన తన ఇంటి పేరును సిరివెన్నెలగా మార్చుకొన్నారు. అక్కడి నుంచి విశ్వనాథ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ ప్రయాణం సుదీర్ఘకాలం సాగింది.

విశ్వనాథ్‌తో సిరివెన్నెల సినిమాలు..
కే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వయంకృషి, స్వర్ణ కమలం, శృతిలయలు, సూత్రధారులు, స్వాతికిరణం, శుభసంకల్పం, స్వరాభిషేకం, శుభప్రదం లాంటి చిత్రాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు. వారిద్దరి మధ్య సాహిత్యపరంగా మంచి అవగాహన ఉండేదని ఆయన సన్నిహితులు చెప్పుకొంటారు.

సిరివెన్నెలకు లభించిన నంది అవార్డులు
ఇక కే విశ్వనాథ్ రూపొందించిన సినిమాలకు రాయడం ద్వారా సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఎక్కువ గుర్తింపు, అవార్డులు లభించాయి. 1986లో సిరివెన్నెల చిత్రంలో విధాత తలపున పాటకు నంది అవార్డుల లభించింది. అలాగే 1987లో శృతిలయలు చిత్రంలో తెలవారదేమో స్వామి పాకటు మరో నంది అవార్డుల లభించింది. ఇక స్వర్ణ కమలం చిత్రంలోని అందెల రవళి పదములదా అనే పాటకు నంది అవార్డు లభించింది. ఇలా సినీ పరిశ్రమలో గొప్ప అనుబంధంతో విశ్వనాథ్, సిరివెన్నెల సాగింది.

సిరివెన్నెల మరణం తీరని లోటు.. విశ్వనాథ్
ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణ వార్త తెలియగానే కే విశ్వనాథ్ ఎమోషనల్ అయ్యారు. ఇది నమ్మలేని నిజం. నిజం జరిగిన నమ్మలేనటువంటి పరిస్థితి. సిరివెన్నెల మరణం నాకు తీరని లోటు. బాలసుబ్రమణ్యం మరణంతో కుడిభుజాన్ని కోల్పోయాను. సిరివెన్నెల మృతి ఎడమ భుజాన్ని కోల్పోయాను అంటూ విశ్వనాథ్ ఎమోషనల్ అయ్యారు.
Recommended Video

ఏం మాట్లాడలేని పరిస్థితి.. క్షమించండి.. కళాతపస్వి
చక్కగా నవ్వుతూ కనిపించే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక్కసారిగా అంతర్థానం అయ్యారు. ఈ వార్తను నమ్మలేకపోతున్నాను. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను. సిరివెన్నెల కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని కోరుకొంటూ ఇంతటితో విరమిస్తున్నాను. ఇది ఏం మాట్లాడలేని పరిస్థితి. నన్ను క్షమించాలి అంటూ కే విశ్వనాథ్ తన భావాలను పంచుకొన్నారు.


Click it and Unblock the Notifications











