twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదే నే ప్రకటనల్లో కనిపించటానికి కారణం : కె.విశ్వనాథ్

    By Srikanya
    |

    హైదరాబాద్ : నేను ఫస్ట్ చేసిన యాడ్ 'మెడ్విన్'ది. మణిశంకర్ దర్శకత్వం వహించారు. ఆ యాడ్‌లో నేను ఫ్యామిలీ డాక్టర్‌లా చేశాను. నాకు ఫ్యామిలీ డాక్టర్ అంటే ఓ నమ్మకం. అందుకని కాన్సెప్ట్ నచ్చి, ఆ యాడ్‌లో చేశాను. అంటూ ప్రముఖ దర్శకుడు కె విశ్వనాధ్..తను యాడ్స్ లో చేయటానికి కారణం వివరించారు.

    అలాగే దీనికి రకరకాల కారణాలు చెప్పొచ్చు. చన్నీళ్లకు వేడినీళ్లు తోడులా విశ్వనాథ్ యాడ్స్ చేస్తున్నాడని చెప్పుకునేవాళ్లు ఉంటారు. ఏదో సెంటిమెంటల్ అటాచ్‌మెంట్ ఉంది కాబట్టే చేశాడనేవాళ్లు ఉంటారు. ఆ తర్వాత కొంత టైమ్ గడిచింది. 'సువర్ణభూమి' వాళ్లు వచ్చారు. చాలా చిన్న స్థాయి నుంచి వస్తున్నామండి. మీరు చేసి పెడితే మాకు ఉపయోగం ఉంటుందన్నారు. చాలారోజులు చెయ్యనన్నాను. కానీ వాళ్లు పట్టు వదల్లేదు. సరే చేశాను. మరి.. వాళ్ల అదృష్టమో నా అదృష్టమో అది బాగా అందుకుంది. అది చూసి, మరికొంతమంది వచ్చారు. సరే... అమితాబ్‌బచ్చన్ అంతటివాడు చేయగా లేనిది మనమెందుకు చెయ్యకూడదు అనుకున్నాను. పంచతులసి యాడ్‌లో కూడా చేశాను అని వివరించారు.

    ప్రస్తుతం కె.విశ్వనాధ్... 'సూర్యపుత్రుడు' టీవీ సీరియల్ చేస్తున్నారు... బుల్లితెర అనుభవం గురించి చెప్తూ.. నేను వేటూరి సుందరామ్మూర్తిగారి కోసం టీవీకొచ్చాను. ఆ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా చేయలేదు. వీళ్లు తమిళ నిర్మాతలు. ఒక మంచి ప్రయోజనం కోసం నా దగ్గరకొచ్చారు. కానీ అది ఆచరణలో పెట్టలేదు. మళ్లీ వాళ్లు 'సూర్యపుత్రుడు' ప్రాజెక్ట్‌తో వచ్చారు. ఇది మీరు చేస్తే చాలా బాగుంటుందన్నారు. అయినా నేను ఒప్పుకోలేదు.

    నాకు చిన్నా పెద్దా అని కాదు. అలాగే భయమూ లేదు. ఈయనకు సినిమాల్లో వేషాల్లేక చేస్తున్నాడని ఎవరూ అనుకోరు. టీవీ సీరియల్ అంటే ఒత్తిడి అని విన్నాను. రాత్రింబగళ్లు చేయాలంటారు. నా వల్ల కాదన్నాను. కానీ అలా ఉండదని, మీకు సౌకర్యవంతంగానే ఉంటుందని అన్నారు. చివరికి ఒప్పుకున్నాను అన్నారు.

    English summary
    K Vishwanath, the man who delivered hits like Sankarabaranam became a brand ambassador for lesser known products. After testing waters with brands like Swarnabhoomi and Medwin, he now took the coat of ambassador for Ayurveda brand Panch Tulasi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X