twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే మనకు అవార్డులు రావు: కె.విశ్వనాధ్

    By Srikanya
    |

    మనకి మన సినిమాని మార్కెట్ చేసుకోవడం రాదు. ఇతర భాషా చిత్రాల విషయమే చూస్తే... విడుదలకు ముందు నుంచే వాళ్ల సినిమాలకు ఇంటర్నేషనల్ మీడియాలో రకరకాలుగా ప్రాచుర్యం కల్పిస్తారు. నిజంగానే ఆ సినిమాలో ఏదో గొప్పదనం ఉంది అనుకునేలా చేస్తారు. దాంతో జ్యూరీ సభ్యులకు ముందుగానే ఆ సినిమా మీద ఓ పాజిటివ్ అభిప్రాయం ఉంటుంది. ఇంక మనకెలా వస్తాయి అవార్డులు? అంటూ ప్రశ్నించారు ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్. ఆయన తాజాగా ఓ లీడింగ్ న్యూస్ పేపరు కి ఇంటర్వూ ఇస్తూ...ఇలా స్పందించారు.

    అలాగే...మనకు అవార్డులు రావు. అలాగని మనం మంచి సినిమాలు తీయడం లేదని కాదు. ఏం, బాపుగారి 'సాక్షి' మంచి సినిమా కాదా...అలాంటి సినిమాలు ఇంకెన్ని తీయలేదు మనం....వాటికెందుకు అవార్డులు రావడం లేదు!అసలు మన సినిమాని మనమే మెచ్చుకోం ముందు. భమిడిపాటి కామేశ్వరరావుగారు అన్నట్టు... ఎదుటివాడు తెల్లచొక్కా వేసుకుంటే తట్టుకోలేక ఇంకు చల్లుతాడట మరో తెలుగువాడు. లోపం మనలో పెట్టుకుని అవార్డులు రాలేదని ఎవరినో అనుకోవడం ఎందుకు అన్నారు.

    ఇక రెండోదేమిటంటే, మనం కేవలం అవార్డు కోసమే సినిమాలు తీయలేం. నిర్మాతకి నష్టం రాకూడదనుకుంటాం. మన సినిమా కొవ్వూరు వెళ్లాలి, కలకత్తా వెళ్లాలి. అందరికీ నచ్చాలి. కాబట్టి కావలసిన ఎలిమెంట్స్ పెట్టాలి. అది అర్థం చేసుకోకుండా పాటలున్నాయి కాబట్టి నేషనల్ అవార్డుకు పనికి రాదంటే ఎలా! అయితే ఇప్పుడిప్పుడే కాస్త ట్రెండ్ మారుతోంది. కొందరు అవార్డుల కోసం సినిమాలు తీస్తున్నారు. కానీ డబ్బులొస్తాయో రావో తెలీని సబెక్ట్ మీద డబ్బు పెట్టడానికి ఏ నిర్మాత ముందుకొస్తాడు? అందుకే ఎవరి డబ్బులు పెట్టి వాళ్లు తీసుకుంటున్నారు అని తేల్చి చెప్పారు.

    తన ప్యూచర్ ప్రాజెక్టు 'సర్వమంగళ'గురించి చెపుతూ...పెరట్లో జాగ్రత్తగా పెంచిన కరివేపాకు చెట్టును కొట్టేస్తాం. ఇన్నాళ్లూ వీడికి కరివేపాకు ఇచ్చాను, నన్ను కొట్టేస్తాడా అని కుంగిపోయి అది చచ్చిపోదు. మళ్లీ చిగురిస్తుంది. పెంపుడు కుక్క సోఫా కొరికేసిందని నాలుగు దెబ్బలేస్తాం. ఇన్నాళ్లూ వీళ్లింటికి కాపలా కాశాను, ఇవాళ నన్ను కొడతాడా అని అది అలిగి బావిలో దూకి చచ్చిపోదు. మన వెంటే తిరుగుతుంది. కానీ మనిషలా కాదు. ప్రతి చిన్నదానికీ బాధ పడిపోతాడు.

    నిరాశతో ప్రాణాలు తీసుకోవాలనుకుంటాడు. ఆ బలహీనత గురించి రాసిందే 'సర్వమంగళ'. టీవీ సీరియల్ కోసం నేను మొదటిసారి రాసిన కథ అది. నన్నో సీరియల్ డెరైక్ట్ చేయమని మూడు నెలలు తిరిగితే నేను ఒప్పుకోలేదు. పోనీ కథేమైనా ఇవ్వమంటే ఆ కథ రాసి ఇచ్చాను. చాలా అద్భుతమైన కథ! కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. కొందరు ఫ్రెండ్‌‌స అ సబ్జెక్ట్‌నే మళ్లీ తీద్దామంటున్నారు. చూడాలి కుదురుతుందో లేదో అన్నారు. ఆయన కోరిక తీరాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.

    English summary
    Director K. Viswanath is an Indian film director and actor from Telugu Cinema. He is a multiple winner of National Film Award and Nandi Award. Present K.Viswanath wants to make a new film titled Sarwa Mangala. He wrote the story Sarmangala on Subsides. He says it's a wonderful story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X