కె విశ్వనాధ్ లేటెస్ట్ చిత్రం రిలీజ్ ఎప్పుడంటే...

By Srikanya

నరేష్, మంజరి జంటగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో శ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ ప్రై.లి. సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఈ నెలాఖరులో ఆడియోను, వచ్చే నెలాఖరులో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయం నిర్మాత మీడియాకు తెలియపరిచారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన హరిగోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ...వయసును లెక్క చేయకుండా నేటి యువ దర్శకులతో సమానంగా శ్రమ పడుతూ అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం అన్నవరం, కేరళ, విజయనగరం పరిసర ప్రాంతాల్లో చిత్రాన్ని విశ్వనాథ్ ‌గారు చిత్రాన్ని పూర్తి చేయగలిగారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అన్నారు. అలాగే విశ్వనాథ్ ‌గారి గత చిత్రాలైన 'ఓ సీత కథ', 'శుభోదయం', 'శుభలేఖ' చిత్రాల కోవలో సునిశిత హాస్యంతో ఉండే సినిమా ఇది అన్నారు.

సుమధురం అనే వర్కింగ్ టైటిల్ తో తయారవుతున్న చిత్రం మన సంస్కృతి సంప్రదాయాలు, అనుబంధాలకీ, ఆప్యాయతలకీ అద్దంపట్టేలా తయారవుతోందని తెలుస్తోంది. ఈ చిత్రం కథ...మన చేతికి అందిన ప్రతి పైసాలోనూ మన కష్టం కనిపించాలి. అప్పుడే దాన్ని ఖర్చుపెట్టినా, వెనకేసుకున్నా తృప్తి మిగులుతుంది. అయాచితంగా వచ్చింది కదాని సొమ్ము పోగేస్తే నిలుస్తుందా?..ఈ విషయాన్ని చుట్టూ తిరుగుతుంది. అలాగే ఇందులో యాసిడ్ ఎటాక్స్ పై కొంత కథ నడవనున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి మాటలు: ఎం.వి.ఎస్. హరనాథరావు, సంగీతం: మణిశర్మ. కె.విశ్వనాధ్...తన స్వరాభిషేకం చిత్రం అనంతరం రూపొందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X