నేనో దర్శకుణ్ని అనే విషయం మర్చిపోతాను: కె.విశ్వనాథ్
నటన నాకు హాబీ మాత్రమే.ఓ సినిమా ఒప్పుకున్నాకా నేనో దర్శకుణ్ని అనే విషయం మర్చిపోతాను. చిత్ర దర్శకుడు ఏమి చెబితే అదే చేస్తాను అంటున్నారు ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్. రీసెంట్ గా రిలీజైన 'మిస్టర్ పర్‌ఫెక్ట్'చిత్రంలో ఆయన ఓ కీలకమైన పాత్రను పోషించారు. ఈ చిత్రం విజయవంతమై సక్సెస్ ఫుల్ గా ఆడుతున్న సందర్భంగా మీడియాని చిత్రం యూనిట్ కలిసింది.ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా స్పందించారు. చిత్రం హీరో ప్రబాస్ మాట్లాడుతూ...కె.విశ్వనాథ్‌తో కలిసి నటించడం లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్‌గా భావిస్తున్నాను. ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఈ విజయంతో ఆ కష్టం తేలిపోయిందని చెప్పుకొచ్చారు. తర్వాత దర్సకుడు దశరధ్ మాట్లాడుతూ..ఈ కథ బాగా రావడానికి కారణం ప్రభాస్. ఆయన శరీరాకృతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అది సినిమా విజయానికి ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











