లిమ్కా బుక్‌లో స్ధానం పొందిన కె.విశ్వనాథ్

లిమ్కా బుక్ లో ...భారతీయ చలన చిత్రసీమలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిని ఎంపిక చేశారు. వారిలో ప్రముఖ తెలుగు దర్శకులు కె.విశ్వనాథ్ ఒకరు. కమల్‌హాసన్, నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, ఎ.శ్రీకర్‌ప్రసాద్, ప్రభుదేవా, సంతోష్ శివన్, కాజల్, టబు తదితరులున్నారు. లిమ్కా బుక్ గౌరవం దక్కినందుకు విశ్వనాథ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కె.విశ్వనాధ్... 'సూర్యపుత్రుడు' టీవీ సీరియల్ చేస్తున్నారు... బుల్లితెర అనుభవం గురించి చెప్తూ.. నేను వేటూరి సుందరామ్మూర్తిగారి కోసం టీవీకొచ్చాను. ఆ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా చేయలేదు. వీళ్లు తమిళ నిర్మాతలు. ఒక మంచి ప్రయోజనం కోసం నా దగ్గరకొచ్చారు. కానీ అది ఆచరణలో పెట్టలేదు. మళ్లీ వాళ్లు 'సూర్యపుత్రుడు' ప్రాజెక్ట్‌తో వచ్చారు. ఇది మీరు చేస్తే చాలా బాగుంటుందన్నారు. అయినా నేను ఒప్పుకోలేదు.
నాకు చిన్నా పెద్దా అని కాదు. అలాగే భయమూ లేదు. ఈయనకు సినిమాల్లో వేషాల్లేక చేస్తున్నాడని ఎవరూ అనుకోరు. టీవీ సీరియల్ అంటే ఒత్తిడి అని విన్నాను. రాత్రింబగళ్లు చేయాలంటారు. నా వల్ల కాదన్నాను. కానీ అలా ఉండదని, మీకు సౌకర్యవంతంగానే ఉంటుందని అన్నారు. చివరికి ఒప్పుకున్నాను అన్నారు.


Click it and Unblock the Notifications











