కె.విశ్వనాధ్ కొత్త సినిమా పాయింటు ఏంటి?
కె.విశ్వనాధ్, అల్లరి నరేష్ ల కాంబినేషన్లో రెడీ అవుతున్న సుమధురం (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రం మన సంస్కృతి సంప్రదాయాలు, అనుబంధాలకీ, ఆప్యాయతలకీ అద్దంపట్టేలా తయారవుతోందని తెలుస్తోంది. ఈ చిత్రం కథ గురించి అల్లరి నరేష్ చెబుతూ.."మన చేతికి అందిన ప్రతి పైసాలోనూ మన కష్టం కనిపించాలి. అప్పుడే దాన్ని ఖర్చుపెట్టినా, వెనకేసుకున్నా తృప్తి మిగులుతుంది. అయాచితంగా వచ్చింది కదాని సొమ్ము పోగేస్తే నిలుస్తుందా?..ఈ విషయాన్నే మా కథలో చెబుతున్నాం" అంటున్నారు. అలాగే ఇందులో యాసిడ్ ఎటాక్స్ పై కొంత కథ నడవనున్నట్లు చెప్తున్నారు. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాని ప్రకారం హీరోయిన్ పై యాసిడ్ ఎటాక్ జరుగుతుందని, తదనంతరం తన తప్పు లేకుండా జరిగిన దాడిని ఆమె ఎలా ప్రతిఘటించింది, హీరో దానికి ఎలా స్పందిచాడు, ఆ పరిణామాలు ఏమిటీ అని సమకాలీన సమాజం నేపధ్యంలో ఈ కథను తీస్తున్నట్లు వినపడుతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మంజరీ ఫెడ్నిస్ చేస్తోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ ముగిసి ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. త్వరలో సినిమా పేరుని ప్రకటిస్తామని నిర్మాతలు చెప్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











