కె విశ్వనాధ్ తాజా చిత్రం టైటిల్ కన్ఫర్మ్
కె విశ్వనాధ్, అల్లరి నరేష్ కాంబినేషన్లో రెడీ కానున్న చిత్రానికి 'శుభప్రధం' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. దీనికి ముందు సుమధురం అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఫైనల్ గా శుభప్రధం టైటిల్ బావుంటుందని నిర్ణయించారు. అ గతంలో కూడా విశ్వనాధ్ తన చిత్రాలకు 'ఎస్' తో ప్రారంభమయ్యే టైటిల్స్ పెట్డడం తెలిసిందే. 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'స్వర్ణకమలం', 'స్వాతిముత్యం', 'సిరివెన్నెల', 'సాగరసంగమం'...ఇలా దాదాపు చాలా వరకు ఆయన చిత్రాలు 'ఎస్' తోనే మొదలవుతాయి. ఇక స్వరాభిషేకం అనంతరం చిరకాల విరామం తర్వాత చేస్తున్న చిత్రం కావటంతో అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే ఈ చిత్రాన్ని స్వరాభిషేకం నిర్మాత కౌసలేంద్రరావు నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా మంజరి ఫెర్నాండెస్ చేస్తోంది. శ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ ప్రై.లి. సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియోను ఈ నెలాఖరులో, వచ్చే నెలాఖరులో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే విశ్వనాథ్ గారి గత చిత్రాలైన 'ఓ సీత కథ', 'శుభోదయం', 'శుభలేఖ' చిత్రాల కోవలో సునిశిత హాస్యంతో ఉండే సినిమా ఇది అని చెప్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం.వి.ఎస్. హరనాథరావు, సంగీతం: మణిశర్మ.


Click it and Unblock the Notifications











