కె విశ్వనాధ్ కొత్త సినిమా టైటిల్ ఏంటంటే
కె విశ్వనాధ్, అల్లరి నరేష్ కాంబినేషన్లో రెడీ కానున్న చిత్రానికి సుమధురం అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. గతంలో కూడా విశ్వనాధ్ తన చిత్రాలకు 'ఎస్' తో ప్రారంభమయ్యే టైటిల్స్ పెట్డడం తెలిసిందే. 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'స్వర్ణకమలం', 'స్వాతిముత్యం', 'సిరివెన్నెల', 'సాగరసంగమం'... ఇలా దాదాపు చాలా వరకు ఆయన చిత్రాలు 'ఎస్'తోనే మొదలవుతాయి. ఇక స్వరాభిషేకం అనంతరం చిరకాల విరామం తర్వాత చేస్తున్న చిత్రం కావటంతో అంతటా మంచి అంచనాలే ఉన్నాయి.అలాగే ఈ చిత్రాన్ని స్వరాభిషేకం నిర్మాత కౌసలేంద్రరావు నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా అనీల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి.
కె విశ్వనాధ్ అల్లరి నరేష్ సోనమ్ కపూర్ మణిశర్మ బెండు అప్పారావు సిరి సిరి మువ్వ శంకరాభరణం k viswanath sumadhuram allari naresh sonam kapoor mani sharma bend apparao


Click it and Unblock the Notifications