కె విశ్వనాధ్ కొత్త చిత్రం హీరోయిన్ గా ఆమె కన్ఫర్మ్
కళా తపస్వి కె విశ్వనాధ్, అల్లరి నరేష్ కాంబినేషన్ లో ప్రారంభం కానున్న కొత్త చిత్రానికి హీరోయిన్ సెట్ అయ్యింది. నరేష్ తో 'సిద్దు ప్రమ్ శీకాకుళం' చిత్రంలో చేసిన మంజరిని ఈ చిత్రంలోకి తీసుకున్నారు. మొదట విశ్వనాధ్ గారు పద్మప్రియను తీసుకుందామని ఎప్రోచ్ అయ్యారు. అయితే ఆమె చెప్పిన హై రెమ్యునేషన్ వర్కవుట్ కాదని తెలిసి నిర్ణయం మార్చుకున్నారు. అలాగే ఈ చిత్రం డిసెంబర్ 27 న హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభంకానుంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా 'సుమధురం' అని పెట్టినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం మంజరి..రాజా సరసన 'ఇంకోసారి' అనే చిత్రంలో చేస్తోంది. అల్లరి నరేష్..వీరభద్రం అనే నూతన దర్శకుడు చిత్రలో చేస్తున్నారు. అంతేగాక ఉషాకిరణ్ వారు నిర్మించే 'బెట్టింగ్ బంగార్రాజు' చిత్రంలోనూ నటిస్తున్నాడు. 'బెండు అప్పారావు ఆర్.ఎం.పి' మంచి వసూళ్ళు సాధించటంతో మార్కెట్లో మళ్ళీ అల్లరి నరేష్ హవా మొదలైంది.


Click it and Unblock the Notifications











