అమ్మ చేతి కమ్మని వంటలాంటి సినిమా...కె విశ్వనాధ్
ఆనంద్..మంచి కాఫీ లాంటి సినిమా అని శేఖర్ కమ్ముల అన్నట్లు ప్రముఖ దర్శకులు కె.విశ్వనాధ్ తన చిత్రాలని అమ్మ చేతి కమ్మని వంటలా ఉండాలని కోరుకుని తీస్తానంటున్నారు. ఆయన దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందిన 'శుభప్రదం' చిత్రం ఆడియో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో 'శుభప్రదం' విడుదలైంది. ముఖ్యమంత్రి రోశయ్య సీడీని ఆవిష్కరించి ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు అందించారు. ఈ సందర్బంగా కె.విశ్వనాధ్ మాట్లాడుతూ ఇలా స్పందించారు.
కె.విశ్వనాధ్ మాటల్లోనే... "నేటితరం సినిమాలకు భిన్నంగా నా సినిమాలుంటాయనే అభియోగం నా మీద ఉంది. నాకు ఇప్పటికీ నేలపై కూర్చొని అమ్మ చేతి కమ్మని వంట తినడమంటేనే ఇష్టం. అదే తరహాలో నా సినిమాలు కూడా ఉంటాయి. నా ఆఖరు చిత్రం దాకా ఇదే పద్ధతిలో సినిమాల్ని రూపొంది స్తాను. అలాగే శుభప్రదం' సినిమాకు వేటూరితో నేను పాట రాయించుకోలేకపోవడం తీరని లోటు. ఈ సినిమా కోసం అందరం కష్టపడి పనిచేశామని తెలిపారు.
అతిధిగా హాజరైన గాయని పి.సుశీల మాట్లాడుతూ..."ఈ మధ్య కాలంలో ఇలాంటి సాహిత్యం నిండిన పాటలు రాలేదు. మణిరత్నం చక్కని స్వరాలు సమకూర్చారని అన్నారు. అలాగే ఎస్పీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ "ఈ కార్యక్రమం చూస్తోంటే 'శుభ సంకల్పం' వందరోజుల వేడుక గుర్తొచ్చింది. కుటుంబంతో కలిసి చూసే చక్కని సినిమా ఇదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాల పేర్లు తెలుగులోనే పెట్టేవిధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో నరేష్, మంజరి జంటగా చేసారు. హరిగోపాలకృష్ణమూర్తి, పీలా నీల తిలక్ ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











