అప్పుడొస్తే నాకు పోటీ వచ్చేవాడు: కె. విశ్వనాథ్
హైదరాబాద్: జగపతి బాబు-కళ్యాణి జంటగా ప్రముఖ సీనియర్ దర్శకుడు రాధాస్వామి ఆవుల తెరకెక్కిస్తున్న చిత్రం 'ఓ మనిషి కథ'. ఓ శివ్ ప్రొడక్షన్స్ పతాకంపై బాలాభాయ్ చోవాటియా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు కళాతపస్వి కె. విశ్వనాథ్ చిత్ర బృందంతో కలిసి వీక్షించారు.
ఈ సందర్భంగా కె. విశ్వనాథ్ మాట్లాడుతూ....'ఓ మనిషి కథ చిత్రాన్ని చూసిన తరువాత... రాధాస్వామి కనుక నేను సినిమాలు తీస్తున్న టైంలో తెలుగు పరిశ్రమకు వచ్చి ఉంటే కనుక నాకు పోటీనిచ్చేవాడు అనిపించింది. ఒక మనిషి జీవితంలోని సమస్యలను, ఆ సమస్యలను ఎదుర్కోవడానికి ఆ మనిషి పడే ఆరాటాన్ని రాధాస్వామి తెరకెక్కించిన విధానం అద్భుతం అన్నారు.

ముఖ్యంగా జగపతి బాబు నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో అతను పలికించిన హావభావాలు చాలా బాగున్నాయి. జగపతి బాబు భార్యగా కళ్యాణి కూడా ఒక మంచి పాత్రలో నటించింది. సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం ఈ చిత్రానికి ఆయువుపట్టుగటా నిలుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకోగల సత్తా ఉన్న చిత్రమిది అన్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'ఓమనిషి కథ' చిత్రం ఆడియోని జూలై రెండో వారంలో విడుదల చేసి ఈచిత్రాన్ని జులై నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర బృందం తెలిపారు.


Click it and Unblock the Notifications











