ధనుష్‌కు రజనీకాంత్ కౌంటర్.. వాళ్లే గొప్పవాళ్లు అవుతారు..
Recommended Video

కబాలి తర్వాత పా రంజిత్, రజనీకాంత్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కాలా. విడుదలకు ముందే అనేక వివాదాల్లో కూరుకుపోయిన ఈ చిత్రం జూన్ 7వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్‌నారాయణ, హ్యుమా ఖురేషి, ఈశ్వరీరావు, మారుతి, కరుణాకరన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో ధనుష్ ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే..

ధారవి మురికివాడ నేపథ్యంగా
ప్రజల కోసం.. ప్రజల గురించి చేసిన సినిమా ఇది. ముంబైలోని ధారవి మురికి వాడ నేపథ్యంగా సాగే కథను చాలా పరిశోధన చేసి తెరకెక్కించాం. ధైర్యవంతమైన ప్రయత్నమిది. ప్రపంచంలో నిర్లక్ష్యం కాబడిన ప్రజల కథ. కామన్‌మ్యాన్ తరపున పోరాడే నాయకుడి కథ ఇది అని ధనుష్ అన్నారు.

రజనీకి సాటిలేరు
సినిమా పరిశ్రమలోకి ఎన్నో ఆశలతో మరో రజనీకాంత్ కావాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. రజనీకాంత్‌కు ఎవరూ సాటి రారు. ఆయన ఎప్పటికీ ఒక్కరే. సినిమా పరిశ్రమలో మరో రజనీకాంత్ పుట్టడమనేది అసాధ్యం. కాలా చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను అని ధనుష్ పేర్కొన్నారు.

ఎవరికి వాళ్లు గొప్పవాళ్లు
మరో రజనీకాంత్ కావాలని పరిశ్రమకు ఎందరో వస్తుంటారు. కానీ అందరూ ఆయనలా కాలేరు. రజనీకాంత్ మాత్రం ఒక్కరే వుంటారు అని ధనుష్ చేసిన వ్యాఖ్యలపై రజనీకాంత్ స్పందించారు. అయితే నేను మాత్రమే కాదు.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ అందరూ ఒక్కరే ఉంటారు. ఎవరికి వారు గొప్పవారే అని అన్నారు.

దేవుడి దీవెనల వల్లే
సినీ పరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకొన్న వాళ్లే గొప్పవాళ్లుగా అవుతారు. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి. విజయం వరించినప్పుడు దేవుడిపై నమ్మకం లేనివారు అదృష్టమని చెబుతారు. దేవుణ్ణి నమ్మేవారు ఆయన ఆశీస్సుల వల్లే జరిగిందని అనుకుంటారు. అలా దేవుడు ఇచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అని అన్నారు.


Click it and Unblock the Notifications











