రజనీ సూపర్‌స్టారే కాదు.. మా ఎమోషన్.. 50 కేజీల కేక్‌తో ఫ్యాన్స్ హంగామా!
నేల మా జన్మ హక్కు.. దానిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోం అనే సింగిల్ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం కాలా. సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. చెన్నైలోని రోహిణి థియేటర్‌లో ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మొదలైన ప్రత్యేక షో సందర్భంగా అభిమానులు హంగామా చేశారు.
కాలా రిలీజ్‌ను పురస్కరించుకొని ఫ్యాన్స్ పటాసులు కాల్చారు. వాయిద్యాలు, మ్యూజిక్‌తో హోరెత్తించారు. డ్యాన్సులు చేసి అభిమానాన్ని చాటుకొన్నారు. సుమారు 50 కేజీల కేక్‌ను కట్ చేసి పండుగ చేసుకొన్నారు.

రజనీకాంత్ అంటే కేవలం సూపర్‌స్టార్ మాత్రమే కాదు. ఓ ఎమోషన్ అని అభిమానులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని చూడటానికి కర్ణాటక నుంచే కాదు.. జపాన్ వాసులు కూడా చెన్నైలోని రోహిణి థియేటర్‌కు తరలిరావడం విశేషం.


Click it and Unblock the Notifications











