కాలా ట్విట్టర్ రివ్యూ: రజనీ అద్భుతం.. బెస్ట్ మసాలా ఫిల్మ్!

By Rajababu

Recommended Video

Kaala Twitter Review రజనీ అద్భుతం

రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలూ.. ఫ్యాన్స్ ఫీవర్ పట్టుకోవడం చాలా సహజం. అడ్వాన్స్ బుకింగ్ ఎగబడటం, రిలీజ్ రోజున తలైవాపై అభిమానాన్ని చాటుకోవడానికి అభిమానులు హంగామా చేస్తుంటారు. ఆ రోజును పండుగల భావించే ఫ్యాన్స్ పనులన్నీ పక్కన పెట్టేసి ఆనందంలో మునిగిపోతారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఆరాట పడుతుంటారు. అందుకే కాలా చిత్రం రిలీజ్ నేపథ్యంలో కేరళలో ఓ ఐటీ కంపెనీ ఏకంగా జూన్ 7వ తేదీని హాలీడే‌గా ప్రకటించడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఓవర్సీస్‌లో ప్రీమియర్ల నుంచి సోషల్ మీడియాలో ప్రేక్షకుల స్పందన వ్యక్తమవుతున్నది.

బెస్ట్ మసాలా ఫిల్మ్

ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ మసాలా ఫిల్మ్. అద్భుతమైన సందేశంతో రూపొందిన మాస్ ఎంటర్‌టైనర్. రజనీకాంత్ పెర్ఫార్మెన్స్ టాప్ క్లాస్. కాలా చూడాలంటే ప్రధాన కారణం రజనీ. పా రంజిత్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌ సూపర్. క్లైమాక్స్ సీన్ మైండ్ బ్లోయింగ్.

రజనీకాంత్ ఎంట్రీ సీన్

సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎంట్రీ సీన్ అదిరింది.
వర్షంలో ఫైట్ బాగున్నది.
పా రంజిత్ కథ, కథనాలు ఎక్స్‌ట్రార్టనరీగా ఉన్నాయి.
సంతోష్ నారాయణ్ మ్యూజిక్ సూపర్
ఫస్టాఫ్ పక్కా మాస్‌గా ఉంది.

రజనీ బెస్ట్ ఎంట్రీ

ఇప్పటి వరకు నేను చూసిన రజనీ బెస్ట్ ఎంట్రీ ఇదే

న్యూజిలాండ్‌లో టెస్ట్ క్రికెట్

చెన్నైలో 4 గంటలకే ప్రత్యేక షోలు ప్రారంభమవుతున్నాయి. కాలా సినిమా చూస్తుంటే న్యూజిలాండ్‌లో టెస్ట్ క్రికెట్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

కాలా చిత్రం బాగున్నది.

రజనీకాంత్ నటించిన కాలా చిత్రం బాగున్నది. పా రంజిత్, సంతోష్ నారాయణ్ పనితీరు ఎక్సలెంట్. దళపతి తర్వాత నాకు బాగా నచ్చిన రజనీ చిత్రం ఇదే.

ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఐకాన్‌

ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఐకాన్‌గా నిలిచినందుకు రజనీకాంత్‌కు థ్యాంక్స్. రజనీ కెరీర్‌లో మరో అత్యుత్తమ చిత్రమని చెప్పవచ్చు.

వర్షం ఫైట్ సూపర్బ్

వావ్.. వావ్. వావ్.. వావ్.. వర్షం ఫైట్ సూపర్బ్. కాలా బాగుంది.

సంతోష్ నారాయణ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

సెకండాఫ్ బాగుంది. సంతోష్ నారాయణ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫెంటాస్టిక్. మొదటి సీన్ నుంచి చివరి వరకు రజనీ ఇరుగదీశాడు. కాలాలో మంచి మాస్ ప్రేక్షకుల ఫీల్ ఉంది.

ఓవర్సీస్ ప్రీమియర్ల నుంచి

ఓవర్సీస్ ప్రీమియర్ల నుంచి సానుకూలమైన రిపోర్టులు వస్తున్నాయి. ఫస్టాఫ్ బాగుంది అనే మాట బలంగా వినిపిస్తున్నది.

కబాలి కంటే కాలా చెత్తగా

కబాలి కంటే కాలా చెత్తగా ఉంది. కులం పేరుతో ఎక్కువగా పాలిటిక్స్ జొప్పించారు. రజనీ నుంచి మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌నే కోరుకొంటాం. కానీ రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో కూడిన సినిమాలను కోరుకోం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X