twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నీ బూతులే: కాళిచరణ్ ట్రైలర్‍‌పై నిషేదం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 1980 దశకంలో మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'కాళిచరణ్'. శ్రీ కరుణాలయం ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయనిర్మాణ దర్శకత్వంలో'గాయం-2' ఫేం శ్రీప్రవీణ్ రూపొందిస్తున్నారు. చైతన్యకృష్ణ, చాందిని, పంకజ్ కేశ్రీ, రావురమేష్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.

    ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్స్ ఆవిష్కరణ కార్యక్షికమం జరిగింది. అయితే తాజాగా ఈ ట్రైలర్ ను సైబర్ క్రైం పోలీసులు బ్యాన్ చేసారు. ఈ ట్రైలర్లో బూతులు ఎక్కువగా ఉండటంతో పాటు.... రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగేలా ప్రోత్సహించేలా ఇది ఉండటంతో, ఆ ట్రైలర్‌ను వెంటనే అంతర్జాలం‌లో నుంచి వెంటనే తీసివేయాలని ఆదేశించారు. సినిమా నిర్మాత శ్రీప్రవీణ్ కూడా సినిమా ట్రైలర్ ను బ్యాన్ చేసిన విషయాన్ని ధృవీకరించారు. త్వరలోనే మరో ట్రైలర్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు.

    దర్శకనిర్మాత శ్రీప్రవీణ్ ఇటీవల సినిమా గురించి....గతంలో ఓ ప్రెస్ మీట్లో వెల్లడిస్తూ 'ఎనభైదశకంలో మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన యదార్థసంఘటనలను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్ర కథను తయారుచేసుకున్నాను. రాజకీయ నేపథ్యంలో పగ, ప్రతీకారం ప్రధానాంశాలుగా కథ నడుస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్షికమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియోను విడుదల చేసి మే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. సినిమా కోసం పదినెలల పాటు గడ్డం, మీసాలు పెంచానని చైతన్యకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వదేవబత్తుల, సతీష్ ముత్యాల, సంగీతం: నందన్‌రాజ్, లైన్ ప్రొడ్యూసర్: జూపల్లి శ్రీనివాస్.

    English summary
    Chaitanya Krishna, Chandini and Kavitha starer Kaalicharan ran in to a trouble. The movie based on a real incident in 1980s is full of blood and gore. The theater trailer of the movie which released recently showed a taste of how the movie is going to be. But this did not go well with the Andhra Pradesh Cyber Crime Cell. They have termed the trailer as provocative and intending to hurt a community and thereby imposed a ban on it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X