twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కార్తీ 'బిరియాని' స్టోరీ లైన్ ఇదే (ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్: బిరియాని తినడానికి ఫ్రెండ్‌తో పాటు ఓ రాత్రి బయలుదేరిన ఓ కుర్రాడి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనల సమాహారం 'బిరియాని' సినిమా. డిఫరెంట్ జానర్ ఫిలిం. వెంకట్‌ప్రభు చాలా ట్రెండీగా సినిమాను మలిచాడు. హన్సిక ఇందులో చాలా గ్లామరస్‌గా ఉంటుంది. హైదరాబాద్ బిరియానీ రేంజ్‌లో ఉంటుంది.

    కుర్రాళ్లతో కలిసి అల్లరి చిల్లరిగా తిరిగే సుధీర్ బిరియాని తినడానికి వెళ్లిన తరువాత జరిగిన అనేక పరిణామాలు ప్రధాన కథాంశంగా ఉంటాయని, ఓ సాధారణమైన కుర్రాడు చివరికి ఇలాగ కూడా మారగలడా అన్న సరికొత్త పాయింట్ ఈ చిత్రంలో దర్శకుడు చూపారని ఆయన అన్నారు. ముఖ్యంగా డార్క్ హ్యూమర్ ప్రెజెంటేషన్ హైలెట్‌గా ఉంటుందని, కామెడీకి ప్రధానమైన పాత్ర ఉంటుందని, అలాగే యాక్షన్ సీన్స్ అందరికీ నచ్చేలా వచ్చాయని హీరో కార్తీక్ తెలిపారు.

    'ఆవారా', 'నాపేరు శివ', 'శకుని' సినిమాల్లో కార్తి పాత్రలు ఇలానే సాగాయి. ఇప్పుడు 'బిరియాని'లోనూ అంతేనట. ''ఏమో మరి.. నా దగ్గరకు వచ్చిన పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. బహుశా అందుకే ఇంత తొందరగా ప్రేక్షకులకు చేరువ అయ్యానేమో'' అంటున్నారాయన. ఈనెల 20న 'బిరియాని' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కార్తి మీడియాతో మాట్లాడారు.

    కార్తీక్ చెప్పిన చిత్ర విశేషాలు..స్లైడ్ షోలో...

    నా క్యారెక్టర్...

    నా క్యారెక్టర్...

    ఇప్పటి వరకూ నేను చేసిన పాత్రలతో పోలిస్తే ఇందులో చేసిన సుధీర్ పాత్ర పూర్తిగా భిన్నమైనది. యువతకు బాగా నచ్చే ఓ సిటీ కుర్రాడిగా ఇందులో కనిపిస్తా. క్యాజువల్‌గా కనిపించే ప్లేబాయ్ తరహా పాత్ర. ఏ అమ్మాయినైనా రెండు నిమిషాల్లో తన వైపు తిప్పుకునే పాత్ర. అలాంటి వాడు ఓ పెద్ద సమస్యలో చిక్కుకుని దాన్నుంచి ఎలా బయటపడ్డాడనేది కథ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది యంగ్, స్టయిలిష్ అండ్ గ్రిప్పింగ్ మూవీ. శిల్పాన్ని చెక్కినట్లు శ్రద్ధతో ఈ చిత్రాన్ని వెంకట్‌ప్రభు తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు ఇది కొత్త అనుభవాన్నిస్తుంది.

    అక్క సెంటిమెంట్...

    అక్క సెంటిమెంట్...

    కథకు దర్శకుడిచ్చిన ట్రీట్‌మెంట్, సెకండాఫ్‌లోని థ్రిల్లింగ్ పాయింట్స్, కామెడీ ఇందులోని ప్రధానాకర్షణలని చెప్పాలి. విలన్లు చేసే కుట్ర ఎలా బయటపడుతుందనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అక్క సెంటిమెంట్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. నా అక్కగా మధుమిత నటించారు.

    తెలుగులో ఎప్పుడు...

    తెలుగులో ఎప్పుడు...

    ''తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నా. కానీ కుదరడం లేదు. కథలు వింటున్నానుగానీ, అవి నా అంచనాలకు దగ్గరగా ఉండడం లేదు. అన్నయ్యతో కలిసి ఓ సినిమా చేయాలి. కథ వింటున్నప్పుడు 'ఈ సినిమా అస్సలు వదులుకోకూడదు' అనిపించే కథ దొరికితే తప్పకుండా చేస్తా. ''.

    ఇదో స్త్టెలీష్‌ సినిమా

    ఇదో స్త్టెలీష్‌ సినిమా

    ' వెంకట్‌ ప్రభు చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దారు. ఓ చిన్న ట్విస్టు ఇచ్చి.. సినిమా స్వరూపాన్నే పూర్తిగా మార్చేస్తారు. ద్వితీయార్థం అయితే మరింత థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ప్రేక్షకుడిని సీటు చివరన కూర్చోబెట్టి సినిమాను చూసేలా చేస్తుంది. సినిమా అంత సీరియస్‌గా సాగుతున్నా.. అందులోంచే వినోదం పుట్టించారు. సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజాకి వందో సినిమా ఇది. ఆయన కూడా పాటలపై మరింత శ్రద్ధ వహించారు. ''.

    అందుకే పాడా....

    అందుకే పాడా....

    ఇది యువన్‌శంకర్‌కు సంగీత దర్శకునిగా వందో చిత్రం. అందువల్ల ఇది మ్యూజికల్‌గానూ బాగా వచ్చింది. డైరెక్టర్ కోరడంతో తెలుగులో మొదటిసారిగా ఓ పాట పాడాను. ఎనభైలలో వచ్చిన పాటల తరహాలో ఆ పాటని కంపోజ్ చేశాడు యువన్. ఆ పాటను అన్నయ్య (సూర్య) విని ఎస్పీ బాలు గారి ఇన్‌ఫ్లుయెన్స్ నా వాయిస్‌లో ఉందని అన్నాడు. ఈ చిత్రంలో పాట పాడటానికి ప్రధానమైన కారణం అంటూ ఏదీ లేదని, యువన్ వందో చిత్రం కనుక ఆయన అడగడంతో అలా పాడేశానని తెలిపారు. ఏది పాడినా అదొక స్టయల్‌గా ఉండడంతో ఎవరూ బాగాలేదని అనడంలేదని, ఎప్పుడన్నా సందర్భానుసారంగా ‘రా' వాయిస్ ఉంటే ఆ పాటకు ఓ గుర్తింపు వస్తుందని, ప్రస్తుతం తాను పాడి పాటకు అటువంటి గుర్తింపే వచ్చిందన్నారు. మిసిసిపి పాట స్పైసీగా సాగి సరికొత్త డాన్స్ కంపోజింగ్‌తో ఆకట్టుకుంటుందని అన్నారు.

    హీరోయిన్...

    హీరోయిన్...

    హన్సిక గురించి కూడా చెప్పుకోవాలి.
    హన్సిక ఈ చిత్రంలో దాదాపు 12 కిలోల బరువు తగ్గి అందరికీ నచ్చేలా నటించిందని, మొదటి షెడ్యూల్ తరువాత రెండో షెడ్యూల్‌లో ఆమె కాస్ట్యూమ్స్ అన్నీ పనికిరాకుండా పోయాయి. మొదట్లో చూసిన హన్సిక.. ఈ హన్సిక ఒక్కరేనా అనిపించింది.

    సిక్స్ ప్యాక్ ఎప్పుడు..

    సిక్స్ ప్యాక్ ఎప్పుడు..

    సిక్స్ ప్యాక్ మీద నాకంత ఆసక్తి లేదు. తక్కువ టైమ్‌లో చేసే సిక్స్ ప్యాక్ ఆరోగ్యానికి అంత మంచిది కాదనేది నా అభిప్రాయం. కేరక్టర్‌కు ఏది అవసరమో అలా ఉంటే చాలు. ప్రతీ సారి ఈ సినిమాలో సిక్స్‌ప్యాక్‌ చేశారా? ఎప్పుడు చేస్తారు..? ఇలాంటి ప్రశ్నలు నాకు ప్రతీసారీ ఎదురవుతుంటాయి. నా పాత్రలెప్పుడూ సిక్స్‌ప్యాక్‌ డిమాండ్‌ చేయలేదు. రోడ్డుపై నడుచుకొంటూ వెళ్లేవాళ్లను చూడండి. వాళ్లకు ఎన్ని ప్యాక్‌లు ఉంటాయి? చేపలు పట్టేవారి శరీరం సహజంగానే కండలు తిరిగి ఉంటుంది. సినిమాల్లో నా పాత్రలు కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ ప్రయోగాలు ఎందుకు? పనిగట్టుకొని తెచ్చుకోవాలంటే ఆ ప్రయత్నాలు బెడసికొట్టే ప్రమాదం ఉంది. పాత్రకు అవసరం అనుకొంటే చేయక తప్పదు. నేనో బాక్సర్‌గా కనిపించాలనుకోండి. అప్పుడు సిక్స్‌ప్యాక్‌ గురించి ఆలోచిస్తాను. సూపర్‌మేన్‌ పాత్ర చేయడానికి సిక్స్‌ప్యాక్‌ కావాలి. అందుకే అలాంటి పాత్రలు చేయను'' .

    ప్లాపయ్యాయి నిజమే...

    ప్లాపయ్యాయి నిజమే...

    నా చివరి రెండు సినిమాలు నిరాశపరిచిన మాట నిజమే. ఆ సినిమాలు చేస్తున్నప్పుడే నాకు ఫలితం తెలిసిపోయేది. కానీ ప్రేక్షకులు తీర్పు ఇచ్చే వరకూ ఆగాలి కదా? ఒక్కోసారి సినిమాపై నాకు ఏర్పడిన అభిప్రాయం తప్పు కావచ్చు. నాకు నచ్చని సినిమాలెన్నో సూపర్‌ హిట్‌ అయ్యాయి. అందుకే ఆ నమ్మకంతో ఫలితం వచ్చే వరకూ ఎదురుచూస్తాం. 'బిరియాని' మాత్రం నా అంచనాలను తప్పకుండా అందుకొంటుందనే నమ్మకం ఉంది.

    నెక్ట్స్ చిత్రం...

    నెక్ట్స్ చిత్రం...

    ఈ చిత్రం తరువాత ఓ రియలిస్టిక్ చిత్రంలో నటిస్తున్నాను, సిటీలో ఓ వార్డు మెంబర్ పాత్రలో ఎటువంటి భావోద్వేగాలు ఉంటాయో అవన్నీ ఆ చిత్రంలో ఉంటాయి. దర్శకుడు రంజిత్ ఆ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకున్న ఆ చిత్రం నా కొక టర్నింగ్ పాయింట్ అవుతుంది.

    అన్నయ్య సూర్యతో కలిసి ఎప్పుడు?

    అన్నయ్య సూర్యతో కలిసి ఎప్పుడు?

    అన్నయ్య, నేను కలిసి నటించే సినిమా అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని రీచ్ అయ్యేలా కథ కుదరాలి. అలాంటి కథ ఎవరు చెబుతారో చూద్దాం. మల్టీస్టారర్ చిత్రాలపై నాకు పెద్దగా ఇంట్రస్ట్ లేదు కానీ, అన్నయ్యతో కలిసి చేయాలని మాత్రం ఉంది.

    English summary
    Biriyani is an upcoming Telugu Movie. Directed by Venkat Prabhu. Starring Karthi, Prasanna, Hansika Motwani, Sneha, Mysskin, Premji Amaren, Nithin Sathya and Sam Anderson in lead Roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X