ఎన్టీఆర్ స్టెప్స్ పై కార్తీక కామెంట్స్
ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో కార్తీక సెకెండ్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.గత కొద్ది రోజులుగా షూటింగ్ లో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ స్టెప్స్ గురించి మాట్లాడుతూ...ఎన్టీఆర్ తో నటించే అవకాశం రావటం నా అదృష్టం.ఆయన సినిమాలన్నీ చూసాను.ఎన్టీఆర్ డాన్స్ చేస్తూంటే చాలా సంతోషం కలుగుతుంది.ఆయన వేసే ప్రతీ స్టెప్ చాలా కళాత్మకంగా ఉంటుంది.అదీ శాస్త్రీయ నృత్యం నేర్చుకోవటం వల్ల వచ్చిన ఈజ్ కావచ్చు.దమ్ములో ఆయనతో కలిసి స్టెప్స్ వేయబోతున్నాననే ఫీలింగ్ నన్ను నిలవనీయటం లేదు.నేను కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను.భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది.ఇందులో నా పాత్ర పేరు నీలవేణి.మొదటి రోజు షూటింగ్ కి వెళ్లినప్పుడు చాలా ఆనందం కలిగింది.ఎన్టీఆర్ నాతో మాట్లాడిన విధానం బాగా నచ్చింది.అలాగే మా మమ్మిని గౌరవించిన తీరు కూడా చాలా పద్దతిగా ఉంది.ఇక నేను తొలి సినిమా తెలుగులోనే చేసాను.మళ్లీ దమ్ము చిత్రం చేస్తున్నాను.నా చిత్రం రంగం లో నా డాన్స్ లకు మంచి పేరు వచ్చింది.దమ్ముతో కూడా ఆ స్ధాయి గుర్తింపు వస్తుందని భావిస్తున్నాను అంది.


Click it and Unblock the Notifications











