పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రలో ఆ దర్శకుడునే...
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఖుషీగా(లవ్ ఆజ్ కల్ రీమేక్) లో తండ్రి పాత్రను కాశీ విశ్వనాధ్ పోషిస్తున్నారు. కాశీ విశ్వనాధ్..గతంలో తొలి చూపులోనే, నువ్వు లేక నేను లేను వంటి చిత్రాలు డైరక్ట్ చేసారు. రవిబాబు దర్శకత్వంలో ఉషాకిరణ్ వారి నచ్చావులే చిత్రంతో ఆయన తండ్రి పాత్రలకు ఫిక్స్ అయ్యారు. ఆయన ప్రస్తుతం పరమ వీర చక్ర చిత్రంలో ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గానూ, పరుచూరి మురళి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రంలోనూ కీలకమైన పాత్రలను చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ..ఖుషీగా చిత్రం రీసెంట్ గానే కాశీలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకొచ్చింది. తదుపరి షెడ్యూల్‌ని నవంబర్ రెండో వారంలో న్యూజిలాండ్‌లో 40 రోజుల పాటు చేయటానికి ప్లాన్ చేసారు. జయంత్ సి.పరాంన్జీ దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రంలో త్రిష, కృతి కర్బందా హీరోయిన్స్ గాచేస్తున్నారు.
కాశీ విశ్వనాధ్ పవన్ కళ్యాణ్ త్రిష కృతి కర్బందా లవ్ ఆజ్ కల్ kaasi viswanth pawan kalyan trisha kriti kharbanda love aaj kal


Click it and Unblock the Notifications