రజనీ ఫ్యాన్స్‌కి న్యూ ఇయర్ గిఫ్ట్: ‘కబాలి’ డిలీటెడ్ సీన్లు (వీడియో)
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కబాలి’ చిత్రం ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద చేసిన సందడి అంతా ఇంతా కాదు.
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కబాలి' చిత్రం ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమా రిలీజ్ ముందు సౌత్ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు రాని విధంగా భారీ హైప్ క్రియేట్ అయింది.
'కబాలి' రిలీజ్ ముందు ఉన్న అంచనాలను అందుకోవడం సినిమా కాస్త తడబడ్డప్పటికీ... కలెక్షన్లు మాత్రం భారీగానే వచ్చాయి. రూ. 300 కోట్లపైనే ఈ సినిమా గ్రాస్ సాధించింది. కాగా ఈ చిత్ర బృందం నూతన సంవత్సర కానుకగా 'కబాలి' డిలీట్ చేసిన సన్నివేశాలను విడుదల చేసింది.
చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను సోషల్‌మీడియా ద్వారా ఈ వీడియోలను రిలీజ్ చేసారు. డిలీట్ చేసిన సన్నివేశాలు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
రజనీకాంత్-రాధిక రొమాంటిక్ సీన్
సినిమాలో రజనీకాంత్-రాధిక ఆప్టే మధ్య ఓ రొమాంటిక్ సీన్ ఉంది. అయితే సినిమా ఎడిటింగ్ ప్రాసెస్ లో ఈ సీన్ తొలగించారు. ఇపుడు రిలీజ్ చేసారు.
కూతురు ప్రేమ విషయం
సినిమాలో తన కుటుంబాన్ని కలిసిన తర్వాత రజనీకాంత్ ఎప్పుడూ తన కూతురు గురించే ఆలోచిస్తుంటాడు. ఈ క్రమంలో ఆమెను ఎవరో చంపినట్లు కలగని కంగారు పడతాడు. ఆమెను వెతుక్కుంటూ వెళ్లగా ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు గమనిస్తాడు.
కుముథవల్లిపై కబాలి ప్రేమ
కుముథవల్లిపై కబాలి తన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసే సన్నివేశం. అప్పుడు సినిమా నుండి డిలీట్ చేసిన ఈ సీన్ ఇపుడు అభిమానులకు నూతన సంవత్సర కానుకగా రిలీజ్ చేసారు.
డాన్ నుండి రజనీ గన్ అందుకుంటున్న సీన్
మలేషియాలో సీనియర్ డాన్ నుండి కబాలి గన్ అందుకుంటున్న సన్నివేశం. అప్పుడు సినిమా నుండి డిలీట్ చేసిన ఈ సీన్ ఇపుడు అభిమానులకు నూతన సంవత్సర కానుకగా రిలీజ్ చేసారు.
రజనీకాంత్ షూట్ చేస్తున్న సీన్
అప్పుడు సినిమా నుండి డిలీట్ చేసిన ఈ సీన్ ఇపుడు అభిమానులకు నూతన సంవత్సర కానుకగా రిలీజ్ చేసారు.


Click it and Unblock the Notifications











