twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ. 300 కోట్ల దిశగా కబీర్ సింగ్... టాప్ సినిమాలను వెనక్కి నెట్టేస్తూ ప్రభంజనం!

    |

    తెలుగు సూపర్ హిట్ మూవీ 'అర్జున్ రెడ్డి' హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ అయి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. కంటెంటులో దమ్ముంటే ఏ భాషలో అయినా విజయం సాధ్యమే అని మరోసారి రుజువైంది. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా రూపొందిన 'కబీర్ సింగ్' బాక్సాఫీస్ వసూళ్లు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

    సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలివారంలోనే రూ. 134 కోట్లు వసూలు చేయగా... బుధవారం(13వ రోజు) రూ. 200 మార్కు క్రాస్ అయింది. తాజాగా మూడోవారంలోకి ఎంటరైన ఈ చిత్రం స్ట్రాంగ్ కలెక్షన్లతో దూసుకెళుతోంది.

    భారత్, యూరి-ది సర్టికల్‌స్ట్రైక్స్ చిత్రాలను వెనక్కి నెట్టి

    భారత్, యూరి-ది సర్టికల్‌స్ట్రైక్స్ చిత్రాలను వెనక్కి నెట్టి

    కబీర్ మూవీ విడుదలైన 3వ రోజు రూ. 50 కోట్లు, 5వ రోజు రూ. 100 కోట్లు, 9వ రోజు రూ. 150 కోట్లు, 10వ రోజు రూ. 175 కోట్లు, 13వ రోజు రూ. 200 కోట్ల మార్కును అందుకుంది. 2019లో రూ. 200 కోట్ల మార్కును భారత్(14వ రోజు), యూరి ది సర్జికల్ స్ట్రైక్స్(28వ రోజు) చిత్రాలు రీచ్ అవ్వగా... వీటికంటే తక్కువ సమయంలో ‘కబీర్ సింగ్' ఈ ఫీట్ సాధించింది.

    రూ. 300 కోట్ల దిశగా....

    రూ. 300 కోట్ల దిశగా....

    ఇప్పటి వరకు రూ. 213 కోట్లు వసూలు చేసిన ‘కబీర్ సింగ్'... రూ. 300 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. మూడో వారంలోనూ అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అనే అభిప్రాయాలు ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

    ఈ ఏడాది టాప్ సినిమాలు ఇవే..

    ఈ ఏడాది టాప్ సినిమాలు ఇవే..

    జులై 4న నాటికి బాక్సాఫీస్ ర్యాకింగ్స్ ప్రకారం...2019లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రాల్లో ‘యూరి-ది సర్టికల్ స్ట్రైక్స్' మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో కబీర్ సింగ్, భారత్, కేసరి, టోటల్ ధమాల్ చిత్రాలు ఉన్నాయి. మూడో వారం పూర్తయ్యేలోపు ‘కబీర్ సింగ్' నెం.1 స్థానంలోకి వెళ్లడం ఖాయం అంటున్నారు. మూడోవారంలోనూ ఈ చిత్రం 2వేలకు పైగా స్క్రీన్లలో ప్రదర్శితం అవుతోంది.

    యూత్ ఆదరణ

    యూత్ ఆదరణ

    ‘కబీర్ సింగ్' మూవీలో హీరో హీరోయిన్ మధ్య జరిగే లవ్ ట్రాక్, బ్రేకప్, ఆ తర్వాత ఇద్దరూ కలివడానికి దారి తీసిన పరిణామాలు దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కించిన విధానం ఉత్తరాది యువతను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి తోడు సంగీతం కూడా సూపర్ హిట్ అవ్వడంతో.... బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అదరగొడుతోంది.

    English summary
    The Shahid Kapoor-starrer became the fastest Bollywood film to cross the Rs 200 crore mark in 2019. It achieved the feat in just 13 days of its release, while its contemporaries Bharat and URI: The Surgical Strike crossed the mark in 14 days and 28 days respectively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X