twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గూగుల్ బెస్ట్ మూవీస్ లిస్ట్ రిలీజ్: ‘సాహో’కు షాక్.. తెలుగు సినిమా లేదు కానీ డైరెక్టర్ ఉన్నాడు

    By Manoj
    |

    ప్రస్తుత ప్రపంచంలో ఇంటర్నెట్ హవా కనిపిస్తోంది. మనకు అవగాహన లేని ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకున్నా సెర్చ్ ఇంజన్‌లను ఆశ్రయిస్తున్నారు. వీటిలో గూగుల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా మంది తమ డెస్క్‌టాప్స్, ల్యాప్‌టాప్స్, మొబైళ్లలో గూగుల్‌నే సెర్చ్ ఇంజన్‌గా పెట్టుకుంటున్నారు. ఏ అంశం గురించి తెలుసుకోవాలనుకున్నా.. వెంటనే గూగుల్ తల్లిని అడుగుతున్నారు. ఇలా ఏ అంశం గురించైతే ఎక్కువగా సెర్చ్ చేశారో.. వాటి జాబితాను ఏడాది చివర్లో గూగుల్ విడుదల చేస్తోంది. తాజాగా ఈ సంస్థ 2019 బెస్ట్ మూవీస్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది.

     హీరోయిన్స్‌లో టాలీవుడ్ నుంచి ఇద్దరు

    హీరోయిన్స్‌లో టాలీవుడ్ నుంచి ఇద్దరు

    2019లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన హీరోయిన్ల జాబితాను ఆ సంస్థ రెండు రోజుల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఫస్ట్ ప్లేస్‌లో సోనాక్షి సిన్హా, సెకెండ్, థర్డ్ ప్లేస్‌లో అనుష్క శర్మ, లతా మంగేష్కర్ నిలిచారు. ఇంకా ఈ లిస్టులో ప్రియాంక, ఆలియా, మాధురీ దీక్షిత్ చోటు దక్కించుకున్నారు. అలాగే టాలీవుడ్ హీరోయిన్లు కాజల్ ఏడు, రకుల్ పదో స్థానంలో నిలిచారు.

    హీరోల్లో మాత్రం ఒక్కరిదే ఘనత

    హీరోల్లో మాత్రం ఒక్కరిదే ఘనత

    ఇక, ఇదే తరహాలో హీరోల జాబితాను కూడా గూగుల్ విడుదల చేసింది. ఈ టాప్ 10లో అమితాబ్ మొదటి స్థానంలో, రెండో స్థానంలో అక్షయ్ కుమార్, మూడో స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచారు. ఆ తర్వాత వరుసగా షారుక్ ఖాన్, తమిళ హీరో విజయ్, ఏఆర్ రెహమాన్ ఉన్నారు. టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు (9వ స్థానం) ఒక్కడే అవకాశం దక్కించుకున్నాడు.

     గూగుల్ బెస్ట్ మూవీస్ లిస్ట్ రిలీజ్

    గూగుల్ బెస్ట్ మూవీస్ లిస్ట్ రిలీజ్

    తాజాగా గూగుల్.. ఈ ఏడాది మోస్ట్ సెర్చ్‌డ్ మూవీస్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో మొదటి స్థానాన్ని ‘కబీర్ సింగ్' దక్కించుకోగా, హాలీవుడ్ మూవీస్ ‘అవెంజర్స్: ఎండ్ గేమ్', ‘జోకర్', ‘కెప్టెన్ మార్వెల్' రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇక, ‘సూపర్ 30', ‘మిషన్ మంగళ్', ‘గల్లీ బాయ్', ‘వార్', ‘హౌస్‌ఫుల్ 4', ‘ఉరి' వరుసగా మిగిలిన స్థానాలను దక్కించుకున్నాయి.

    అప్పుడు ప్రభాస్ సినిమాల హవా

    అప్పుడు ప్రభాస్ సినిమాల హవా

    2015 సంవత్సరంలో విడుదలైన ఈ జాబితాలో మన తెలుగు సినిమా ‘బాహుబలి'కి మొదటి స్థానం దక్కింది. అలాగే, 2017లో ‘బాహుబలి 2' కూడా ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ రెండింటినీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించాడు. ఈ రెండు చిత్రాలు మినహా తెలుగు నుంచి ఏదీ ఈ జాబితాల్లో అవకాశాలు దక్కించుకోలేదు.

    తెలుగు సినిమా లేదు కానీ డైరెక్టర్ ఉన్నాడు

    తెలుగు సినిమా లేదు కానీ డైరెక్టర్ ఉన్నాడు

    ఈ ఏడాది విడుదల చేసిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. వాస్తవానికి అప్పట్లో బాగా ట్రెండ్ అవడంతో ప్రభాస్ నటించిన ‘సాహో' ఉంటుందని అంతా అనుకున్నారు. ఈ సినిమా హిందీలో కలెక్షన్లు భారీగా సాధించింది. కానీ, ఆ సినిమా లేదు. అయితే, తెలుగు డైరెక్టర్‌ మాత్రం ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. అతడే.. సందీప్ రెడ్డి వంగా. మొదటి స్థానంలో ఉన్న ‘కబీర్ సింగ్' సినిమాకు ఆయనే దర్శకుడు.

    English summary
    Year 2019, saw some really big releases in Bollywood. And some epic flops as well. But Rs 100 crore (or more) at the box office will not guarantee you a spot on Google's top trends. That's a feat only few can achieve.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X