మీ హీరోకు అంత సీన్ ఉందా? కుర్రకుంక... రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్!

Recommended Video

Issue Between Vijay Devarakonda Fans & Shahid Kapoor Fans | Arjun Reddy | Kabir Singh || Filmibeat

విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రం తెలుగులో సూపర్ హిట్ కల్ట్ మూవీగా నలిచింది. ఈ సినిమా తర్వాత విజయ్ దశ తిరిగింది. మంచి కంటెంట్ ఉన్న, యునిక్ కల్ట్ మూవీ కావడంతో ఈ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేస్తున్నారు.

తెలుగులో ఈ చిత్రాన్ని రూపొందించిన సందీప్ వంగ.. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ఇదే చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'కబీర్ సింగ్' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదల చేశారు. దీనికి సోషల్ మడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ టీజర్ విడుదలైన తర్వాత విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది.

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ను కెలికారు...

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌ను కెలికారు...

‘అర్జున్ రెడ్డి' చిత్రం హిందీలో రీమేక్ కావడంపై విజయ్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. అయితే షాహిద్ కపూర్ అభిమానులు ‘విజయ్ దేవరకొండకు మా హీరో అంత టాలెంట్ లేదు, అందుకే షాహిద్ టీజర్ ఒరిజినల్ మూవీ టీజర్ కంటే బావుంది' అంటూ కించపరిచే విధంగా కామెంట్లు చేయడంతో గొడవప్రారంభమైంది.

మంచి సినిమాను నాశనం చేశారు

మంచి సినిమాను నాశనం చేశారు

‘అర్జున్ రెడ్డి' మూవీ బాలీవుడ్లో రీమేక్ చేయడం వల్ల... ఒక మంచి సినిమాను నాశనం చేస్తున్నారు. ‘కబీర్ సింగ్' టీజర్ చూశాం... మాకు ఏ మాత్రం నచ్చలేదు' అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు విరుచుకుపడుతున్నారు.

విజయ్ లెజెండ్, షాహిద్ ఒక కుర్రకుంక

విజయ్ లెజెండ్, షాహిద్ ఒక కుర్రకుంక

‘‘ఒరిజినల్ సినిమా ఎప్పుడూ ఒరిజినల్ సినిమాయే. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చేయలేం. ‘కబీర్ సింగ్' ఎప్పటికీ ‘అర్జకున్ రెడ్డి' స్థాయిని అందుకోలేదు. విజయ్ దేవరకొండ లెజెండ్.. షాహిద్ ఒక కుర్రకుంక'' అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో రెచ్చిపోయారు.

ఎదురు దాడి ప్రారంభించిన షాహిద్ ఫ్యాన్స్

ఎదురు దాడి ప్రారంభించిన షాహిద్ ఫ్యాన్స్

విజయ్ దేవరకొండ అభిమానులు తమ కామెంట్లతో రెచ్చిపోతుంటే... అటు షాహిద్ కపూర్ ఫ్యాన్స్ కూడా తమ ప్రతాపం చూపిస్తున్నారు. ‘కబీర్ సింగ్' టీజర్ చాలా చాలా బెటర్‌గా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మీ హీరోకు అంత సీన్ ఉందా?

మీ హీరోకు అంత సీన్ ఉందా?

‘‘ఒరిజినల్ మూవీ ఎప్పటికీ ఒరిజినల్‌గానే ఉంటుంది. కానీ షాహిద్ కపూర్ తన టాలెంట్ మొత్తం ఉపయోగించి రీమేక్ అయినా అద్భుతంగా చేశాడు. విజయ్ దేవరకొండ ఒక వేళ షాహిద్ నటించిన కమీనే, హైదర్, ఉడ్తా పంజాబ్ చిత్రాలు రీమేక్ చేస్తే... ఆ పాత్రలకు న్యాయం చేయలేడు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఇకనైనా మీ వితండ వాదం ఆపండి.'' అంటూ షాహిద్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X