మణిరత్నం ‘కడలి’ రిలీజ్ డేట్ ఖరారు
చెన్నై: చాలా కాలం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'కడల్'. మణితర్నం సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. సాధారణ సినిమాల కంటే ఆయన సినిమాలు ప్రతి విషయంలోనూ భిన్నంగా ఉండటమే అందుకు కారణం. 2010లో వచ్చిన 'రావణ్' చిత్రం తర్వాత ఆయన దర్శకత్వంలో ఇప్పటి వరకు ఏ చిత్రం రాలేదు. దాదాపు రెండు మూడేళ్ల గ్యాప్ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్ర 'కడల్'.
సముద్రం నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఎక్కువ భాగం కేరళలో తెరకెక్కించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. వనమాలి సాహిత్యం సమకూరుస్తున్నారు. తాజాగా ఈచిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 1న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తమిళ హీరో కార్తీక తనయుడు గౌతమ్, మాజీ హీరోయిన్ రాధ రెండవ కూతురు తులసి 'కడలి' చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయం అవుతున్నారు. దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మణిరత్నం, మనోహర్ ప్రసాద్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రంలో హీరోయిన్ తల్లిగా కనిపించనుందని సమాచారం. ఈ చిత్రంలో ఆమె యాక్షన్ స్టార్ అర్జున్ కి భార్యగా కనిపించనుంది. మంచు లక్ష్మి, అర్జున్ ఇద్దరూ మిడిల్ క్లాస్ జంటగా కనిపిస్తారు. వీరి ముద్దులు కూతురు తులసి. తులసి ప్రేమ కథ చుట్టూ కథ జరుగుతుంది. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ హైలెట్ అని చెప్తున్నారు. జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ చిత్రం మద్రాసు టాకీస్ పతాకంపై రూపొందుతున్న 14వ చిత్రం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 23వ చిత్రం కావడం విశేషం.


Click it and Unblock the Notifications












