»   » చిరంజీవి 150 మూవీ టైటిల్ కాపీకొట్టినట్లే ఉంది!

చిరంజీవి 150 మూవీ టైటిల్ కాపీకొట్టినట్లే ఉంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ల్యాండ్ మార్క్ మూవీకి 'ఖైదీ నెం 150' అనే టైటిల్ పిక్స్ చేయడంతో..... దాన్ని కాస్త అటూ ఇటుగా ఇమిటేట్ చేస్తూ, ఆ టైటిల్ ను కాస్త కాపీ చేస్తూ కొత్త సినిమాల టైటిల్స్ పుట్టుకొస్తున్నాయి.

తమిళంతో తెరకెక్కించి ఓ సినిమా తెలుగులో 'కాదంబరి ఇంటి నెంబర్ 150' అనే పేరుతో ఓ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఈ టైటిల్ చూసిన వారంతా ఇది చిరంజీవి 150వ సినిమా టైటిల్ ను పోలి ఉందని చర్చించుకుంటున్నారు.

Kadambari Inti No 150 movie details

ఇదో హారర్ కామెడీ మూవీ. తమిళంలో మంచి విజయం సాధించడంతో తెలుగు డబ్బింగ్ రైట్స్ తీసుకున్న నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు కాదంబరి. ఆమె ఇంటి నెంబర్ 150 కావడంతో ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

పేరుతో పాటు.... టైటిల్ లోగో డిజైన్ కూడా చిరంజీవి 150వ సినిమాను పోలి ఉండటం విశేషం. మొత్తానికి ఈ ఇమిటేషన్ వ్యవహారం సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది.

English summary
Tamil horror movie releasing in telugu as Kadambari Inti No 150.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu