రూ. 30 కోట్లు ఎగ్గొట్టిన హాట్ లేడీ ప్రొడ్యూసర్
హైదరాబాద్ : బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ లేడీ, ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్‌కు చెందిన బాలాజీ టెలిఫిల్మ్ కార్యాలయంపై, ఆమె ఇంటిపై వంద మంది ఇన్‌కం టాక్స్ అధికారులు దాడి చేసి సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ టాక్స్ ఎగ్గొట్టిందనే అనుమానం రావడంతో అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారు.
అధికారిక వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం బాలాజీ టెలి ఫిల్మ్ష్ సంస్థ రూ. 30 కోట్ల టాక్స్ ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. అధికారులు పూర్తి విచారణ అనంతరం వివరాలు బయట పెట్టనున్నారు. తాజాగా ఆమె నిర్మించి షూటౌట్ ఎట్ వాడాల చిత్రం ఈ రోజు విడుదలైన నేపథ్యంలో అధికారులు మరో రౌండ్ దాడి చేసి సోదాలు నిర్వహించే అవకాశం ఉంది.
బాలాజీ టెలిఫిల్మ్స్ సంస్థ కొంత కాలంగా పన్ను ఎగవేతకు పాల్పడుతుందని, అక్రమ మార్గంలో ఐటి డిపార్టుమెంటను బురిడీ కొట్టిస్తుందనే అనుమానంతో గత కొంతకాలంగా అధికారులు నిఘా పెట్టారు. 'షూటౌట్ ఎట్ వాడాలా' చిత్రం విడుదల సందర్బంగా ఈ దాడులు జరుగడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఏక్తాకపూర్ ప్రస్తుతం దాదాపు 10 బాలీవుడ్ సినిమాల్లో, టెలివిజన్ కార్యక్రమాల్లో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












