శేఖర్ కమ్ముల కొత్త చిత్రం ఏప్రియల్ నుంచి...

By Srikanya

హైదరాబాద్ : హిందీలో సూపర్ హిట్టైన 'కహానీ' చిత్రాన్ని తెలుగులోకి శేఖర్‌ కమ్ముల తీసుకొస్తున్న సంగతి తెలిసిందే . ఆయన దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో కథానాయికగా నయనతార నటించబోతోంది. ఈ సినిమాకి రచన బాధ్యతల్ని యండమూరి వీరేంద్రనాథ్‌ తీసుకొన్నారు. ఏప్రిల్‌ నుంచి చిత్రీకరణ మొదలవుతుంది.

కనిపించకుండాపోయిన భర్తను వెతుక్కుంటూ లండన్ నుంచి కోల్‌కతాకు వస్తుంది ఓ యువతి. ఒకవైపు కడుపులో ఎదుగుతున్న బిడ్డ భారాన్ని ఇష్టంగా మోస్తూ, మరోవైపు భర్త ఆచూకీ తెలియక ఆ యువతి పడే ఆవేదన వర్ణనాతీతం. ఈ మానసిక సంఘర్షణను, శరీరంలో చోటు చేసుకునే మార్పులను 'కహానీ' చిత్రంలో విద్యాబాలన్ అద్భుతంగా ఆవిష్కరించారు. అందుకే ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఎన్నో పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రకథాంశం కూడా అందర్నీ ఆకట్టుకుంది. విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఈ పాయింట్‌పట్ల ఇంట్రస్ట్ చూపించారు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఈ రీమేక్‌లో నయనతారను హీరోయిన్ గా ఫిక్స్ చేసారు. ఈ చిత్రం గురించి నయన్‌తో సంప్రదింపులు జరిపారని, ఆమె అధికారికంగా సంతకం చేయడమే ఆలస్యం అని సమాచారం.

ఒరిజినల్ ఫ్లేవర్ చెడిపోకుండా, తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ కథలో కొన్ని మార్పులు చేస్తున్నారట శేఖర్. నయనతార చేయబోతున్న తొలి లేడీ ఓరియంటెడ్ సినిమా ఇదే అవుతుంది. అలాగే శేఖర్ చేయబోతున్న తొలి రీమేక్ కూడా ఇదే. అలాగే చిత్రంలో టెర్రరిజం బ్యాక్ డ్రాప్ తీసేసి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ పెడుతున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్ గర్బం దాల్చే అంశం ఉండకపోవచ్చునని,అందుకు ఆల్టర్నేటివ్ వెతుకుతున్నారని వినపడుతోంది. ఇక ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో ఒకే సారి తెరకెక్కనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X