హాట్ హీరోయిన్ నయనతార...ఇపుడు గర్భవతిగా!
ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో నయనతార 'అనామిక' పాత్రలో కనిపించనుంది. ఎండర్ మోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలక్ట్ మీడియా హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కహానీ చిత్రం కోల్ కతా బ్యాక్ డ్రాప్‌తో సాగుతుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.
వాస్తవానికి ఈచిత్రంలో తొలుత అనుష్క పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నయనతార పేరు కూడా వినిపించింది. తర్జన భర్జనల అనంతరం నయనతార పేరు ఫైనల్ అయింది. ప్రముక నావెలిస్ట్ యండమూరి వీరేంద్రనాధ్ ఈ చిత్రానికి సహాయ రచయితగా పని చేస్తున్నారు. విజయ్ సి. కుమార్ సినిమాగ్రఫీ చేయనున్నారు.
సినిమా కథ విషయానికొస్తే... కనిపించకుండాపోయిన తన భర్త గురించి ఒక ఎన్ ఆర్ ఐ గర్భిణి చేసే అన్వేషణే ఈ కహానీ చిత్ర కథ. అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు.
ఈ చిత్రం గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...కహానీ తెలుగు, తమిళం రీమేక్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని, ఇక్కడి నేటివిటీకి తగిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు వెల్లడించారు. కాగా....బాలీవుడ్ వెర్షన్ 'కహానీ'కి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించగా, విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించింది.


Click it and Unblock the Notifications












