కైకాల చనిపోయారని ప్రచారం.. కీలక ప్రకటన చేసిన కుమార్తె..అసలు జరిగింది ఇదేనంటూ క్లారిటీ!

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అయితే మన ఆరోగ్యం బాగానే ఉన్నట్లుగా ఆయన కుమార్తె వాయిస్ మెసేజ్ విడుదల చేశారు. తమ తండ్రి ఆరోగ్యం గురించి చెబుతూ ఇలాంటి ప్రచారాలు చేయవద్దు అని ఆమె కోరారు.. మరో పక్క అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం కూడా కైకాల సత్యనారాయణ ఆరోగ్యానికి సంబంధించిన తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

తీవ్ర అస్వస్థతతో

తీవ్ర అస్వస్థతతో

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. నిజానికి అక్టోబర్ 30వ తేదీన ఆయన ఇంట్లో జారిపోయి పడిపోవడంతో ఆయన కు తీవ్ర అస్వస్థత ఏర్పడింది. అప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని సికింద్రాబాదులో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కైకాల సత్యనారాయణ వెంటనే కోలుకున్నారు. నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత ఆయన డిశ్చార్జి అయి ఇంటికి కూడా వెళ్లారు.

 చనిపోయారని ప్రచారం

చనిపోయారని ప్రచారం

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కైకాల సత్యనారాయణ అనూహ్యంగా శనివారం నాడు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. తీవ్ర అస్వస్థత ఏర్పడడంతో హుటా హుటిన ఆయన కుటుంబ సభ్యులు అపోలో హాస్పిటల్ కి తరలించారు. ఆయన హోటల్ కి వచ్చే సమయానికి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను హుటా హుటిన వెంటిలేటర్ మీద ఉంచి అపోలో ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

మెగాస్టార్ అలా

మెగాస్టార్ అలా

అయితే ఆయనకు చిన్నపాటి సర్జరీ జరిగిందని గొంతు సర్జరీ జరగడంతో ఆయన మాట్లాడలేకపోతున్నారు కానీ మీరు కోలుకుని బయటికి వస్తారు మా అందరితో సంతోషంగా గడుపుతారు అని అంటే థమ్సప్ చూపించారు అని అపోలో హాస్పిటల్ వైద్యులు తనకు చెప్పినట్లుగా మెగాస్టార్ చిరంజీవి తాజాగా వెల్లడించారు. అయితే ఏమైందో ఏమో కైకాల సత్యనారాయణ మరణించారు అంటూ మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

అపోలో ఆస్పత్రి ఏమందంటే?

అపోలో ఆస్పత్రి ఏమందంటే?

ఈ క్రమంలో అప్పటికప్పుడు అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం కైకాల సత్యనారాయణ స్పృహలోనే ఉంటారుం ఆయన రక్తపోటు కంట్రోల్ లోకి వచ్చిందని, అలాగే కిడ్నీ పనితీరు మెరుగుపడుతుందన్న కారణంగా అన్నీ సరైనట్టేనని బులెటిన్ లో పేర్కొన్నారు.

అయితే ఆయన మాత్రం ఇంకా వెంటిలేటర్ నే ఉన్నారని వెంటిలేటర్ సపోర్ట్ నెమ్మదిగా తగ్గించడానికి చూస్తున్నామని వెల్లడించారు. ఈ రోజు GI ట్రాక్ట్ నుండి రక్తస్రావం లేదనీ ప్రస్తుతానికి ఆయన ICUలో ఉన్నా ఆరోగ్య పరిస్థితి అయితే మెరుగుపడుతోందనీ పేర్కొన్నారు.

కుమార్తె వాయిస్ మెసేజ్

కుమార్తె వాయిస్ మెసేజ్

ఇక ఈ ప్రచారం మీద ఆయన కుమార్తె కూడా స్పందించారు. కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నట్టు ఆయన కూతురు రమాదేవి వెల్లడించారు. కైకాల ఆరోగ్యం గురించి ఆడియో వాయిస్ విడుదల చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందనీ, అందరితో మాట్లాడుతున్నారనీ వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందక్కర్లేదన్న ఆమె దయచేసి అనవసర వార్తలతో జనాలను ఆందోళన పరచవద్దనీ కోరారు. ముఖ్యంగా మీడియా వాళ్లు సంయమనం పాటించాలని అందరినీ టెన్షన్ పెట్టవద్దని ఆమె కోరారు. నిన్న dr మాదాల రవి వస్తే ఆయనకు కూడా థంబ్స్ అప్ చూపారని ఆమె అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X