దక్కని పద్మశ్రీ : కైకాల సత్యనారాయణ ఆవేదన

By Bojja Kumar

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడిగా ఓ వెలుగు వెలిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కైకాల సత్యనారాయణ. తనకు ఇప్పటికీ పద్మశ్రీ అవార్డు దక్కక పోవడంపై కైకాల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసారు. కాంతారావు పేరిట జరిగిన సన్మాన సభలో ఆయన తన మనసులోని బాధను బయటపెట్టారు.

తనకు ఇప్పటికీ పద్మశ్రీ అవార్డు దక్కక పోవడం బాధగా ఉందని కైకాల తెలిపారు. పాతికేళ్ల క్రితమే తనను పద్మశ్రీకి నామినేట్ చేశారని... కానీ, ఇంతవరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో టీడీపీ ఎంపీగా ఉన్నందున పద్మశ్రీ ఇవ్వలేదని... ఆ తర్వాతైనా ఇచ్చి ఉండచ్చని, కానీ అలా జరగలేదని చెప్పారు.

Kaikala Satyanarayana discontent on padma awards committee

కైకాల సత్యనారాయణ స్వయంగా తన మనసులోని అసంతృప్తిని బయటకు కక్కడంతో....మరోసారి కేంద్ర ప్రభుత్వం అందించే ‘పద్మ' అవార్డుల అంశం చర్చనీయాంశం అయింది. చాలా కాలం నుండి పద్మ అవార్డుల ఎంపికపై విమర్శలు ఉన్నాయి. అర్హులను గుర్తించడం లేదని, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. పొలిటీషియన్స్‌కి డబ్బులిచ్చి అవార్డులు కొనుక్కుంటున్నా విమర్శలు సైతం ఉన్నాయి.

తాజాగా కైకాల సత్యనారాయణ పరిస్థితి చూస్తే.....పద్మ అవార్డుల ఎంపిక విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నయో అర్థం చేసుకోవచ్చనేది కైకాల సన్నిహితుల వాదన. పద్మ అవార్డులకు ఎంపిక చేసే అర్హుల్లో ఆయన ఆగ్ర స్థానంలో ఉన్నారని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X