Kaikala Health Bulletin : కీలక ప్రకటన చేసిన అపోలో వైద్యులు.. అన్ని ఆర్గాన్స్ ఫెయిల్ అవడంతో!

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడో 1959లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఆయన తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో సుమారు 777 సినిమాల్లో నటించారు.. అయితే ఆయన అనారోగ్య కారణాలతో అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్యపరిస్థితి సంబంధించి అపోలో హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

తాతలు సహా మనవళ్లతో

తాతలు సహా మనవళ్లతో

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత టాలెంటెడ్ యాక్టర్స్ లో కైకాల సత్యనారాయణ ఒకరు. 1959వ సంవత్సరంలో సిపాయి కూతురు అనే సినిమాలో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన ఏకంగా తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో 777 సినిమాల్లో నటించారు. తెలుగు సినీ నటులలో తాతల నుంచి మనవళ్ల తరం వరకు నటించిన ఆయన ఆ మేర తన పేరిట రికార్డులు కూడా లిఖించుకున్నాడు.

 హాస్పిటల్ కి తరలించి చికిత్స

హాస్పిటల్ కి తరలించి చికిత్స

అయితే ఆయన అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలు టెన్షన్ కలిగిస్తున్నాయి. నిజానికి అక్టోబర్ 30వ తేదీన ఆయన తన ఇంట్లో కాలు జారి పడి పోవడంతో తీవ్ర అస్వస్థతకు గురి కాగా ఆయనను కుటుంబ సభ్యులు అప్పుడు సికింద్రాబాదులోని ఒక ప్రైవేటు హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు..

ఆరోగ్యం మెరుగుపడింది

ఆరోగ్యం మెరుగుపడింది

అయితే అప్పుడు చికిత్సకు ఆయన స్పందించడంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడింది దీంతో కొద్ది రోజుల తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకు వెళ్లారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈరోజు ఉదయం ఆయనకు మళ్లీ తీవ్రస్థాయిలో అస్వస్థత ఏర్పడగా ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన అపోలో హాస్పిటల్ కి తరలించారు..

బయటకు రానియ్య లేదు

బయటకు రానియ్య లేదు

అపోలో హాస్పిటల్ కి తరలించారు కానీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానియ్య లేదు ఎందుకంటే గతంలో చాలాసార్లు కైకాల సత్యనారాయణ మరణించారు అంటూ పెద్దఎత్తున ప్రచారం జరగడంతో ఇప్పుడైనా హాస్పిటల్ కి తరలించారు విషయం తెలిస్తే కూడా ఇలాంటి పిచ్చి ఒకరు మళ్ళీ మొదలవుతాయని ఉద్దేశంతో వాళ్లు గోప్యంగా ఉంచారు..

Recommended Video

అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Filmibeat Telugu
ఆరోగ్యం విషమించిందని

ఆరోగ్యం విషమించిందని

అయితే కొద్ది సేపటి క్రితం అపోలో హాస్పిటల్ యాజమాన్యం కైకాల సత్యనారాయణ ఆరోగ్యానికి సంబంధించి ఒక హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తమ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని, ఆయన ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదని వెల్లడించారు.. తాము అందిస్తున్న చికిత్సకు ఆయన శరీరం సహకరించడం లేదని చికిత్సకు ఆయన స్పందించడం లేదని వెల్లడించారు. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో ఆయన ఆరోగ్యం విషమించిందని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X