Kaikala Satyanarayanaకు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అపోలోకి తరలింపు.. వెంటిలేటర్ మీదే?
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులలో కైకాల సత్యనారాయణ ఒకరు. అయితే ఆయన ఇటీవల అస్వస్థతకు గురైనట్టు వార్తలకు వచ్చాయి, అయితే అప్పుడు ఆయన కోలుకున్నారు కానీ తాజాగా ఆయన మరో మారు రో హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎప్పుడూ పుకార్లే
నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం గురించి ఎప్పటికపుడు అనేక రకాల వార్తలు వస్తూ ఉంటాయి . గత నెలలో కూడా ఆయన అస్వస్థతకు గురి కాగా వెంటనే ఆయనను ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అప్పుడు ఆయన ప్రమాదవశాత్తు ఇంట్లో జారి పడ్డారు. దీంతో అప్పుడు ఆయన్ని కుటుంబసభ్యులు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

అన్నింటినీ ఒక రౌండ్ వేసి
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సిపాయి కూతురు సినిమాతో 1959లో సినీ ఎంట్రీ ఇచ్చిన ఆయన 60 ఏళ్లుగా 777 సినిమాల్లో నటించారు కైకాల సత్యనారాయణ. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కైకాల సత్యనారాయణ.. టాలీవుడ్ మూడు తరాల హీరోలతో తెరపంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. అలాగే నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసిన ఆయన.. పలు చిత్రాల్లో హాస్య నటుడిగా, కొన్నింటిలో ప్రతినాయకుడిగా, కొన్నింటిలో హీరోగా కూడా నటించారు.

నవరస నటనా సార్వభౌమ
అందుకే ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా 'నవరస నటనా సార్వభౌమ' అనే బిరుదును కూడా ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీ. తెలుగులో యముడు అనగానే మొదట గుర్తుకు వచ్చేది ఆయనే. మొదటి నుంచి కూడా ఆయన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే 2002 ఇడియట్ సినిమా అనంతరం కైకాల సత్యనారాయణ సినిమాల్లో నటించడం తగ్గించేశారు.

లాక్ డౌన్ మొదలవడంతో
కొన్ని ఆరోగ్య కారణాల వలన మునుపటి తరహాలో వరుసగా సినిమాలు చేయకుండా చాలా నెమ్మదిగా చేసుకుంటూ వచ్చారు. చివరగా 2019లో ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించారు. ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ మొదలవడంతో ఆయన బయటకు రాలేదు. అయితే అప్పటి నుంచి కూడా అయన ఇంటి పట్టునే ఉంటున్నారు.

తీవ్ర అస్వస్థతకు గురై
తాజా సమాచారం మేరకు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన అపోలో హాస్పిటల్ కు తరలించగా అక్కడి వైద్యులు ఆయనకు వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











