ఎన్టీఆర్ బయోపిక్‌లో కైకాల సత్యనారాయణ.. లెజెండరీ దర్శకుడి పాత్రలో!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. దీనితో ఆయన జీవితంలోని కీలక వ్యక్తులందరి పాత్రలని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. కాస్టింగ్ విషయంలో బాలయ్య రాజీ పడడం లేదు.
తన తల్లి బసవతారకం పాత్ర కోసం బాలయ్య ఏరికోరి విద్యాబాలన్ ని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఇతర పాత్రలకోసం అనేకమంది స్టార్ నటుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ ఓ పాత్రలో నటిస్తున్నారు. నేడు సత్యనారాయణ జన్మదినం కావడంతో ఆయన లుక్ విడుదల చేసారు.

సత్యనారాయణ నటిస్తోంది లెజెండరీ దర్శకుడు హెచ్ ఎం రెడ్డి పాత్రలో. భారతీయ సినిమాకు గట్టి పునాది వేసిన అరుదైన అరుదైన దర్శకులు, నిర్మాతలలో హెచ్ ఎం రెడ్డి ఒకరు. హెచ్ ఎం రెడ్డి 1892 లో జన్మించారు. 1930 నుంచే ఆయన దర్శకుడిగా, నిర్మాతగా రాణించారు. భక్త ప్రహ్లాద, కాళిదాస్, వద్దంటే డబ్బు వంటి చిత్రాలని రూపొందించారు. వద్దంటే డబ్బు చిత్రంలో ఎన్టీఆర్ నటించడం విశేషం.


Click it and Unblock the Notifications











