twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నావని నిలదీశారు.. కైకాల సత్యనారాయణ

    |

    తెలుగు తెరపై నవరసాలను అవలీలగా పండించి అదరహో అనిపించిన నటుడు కైకాల సత్యనారాయణ. అబ్బురపరిచే హావభావాలను ప్రదర్శిస్తూ నవరస నటనా సార్వభౌముడుగా గుర్తింపు పొందిన ఈయన వందల కొద్ది సినిమాలో విలక్షణ పాత్రలు పోషించాడు. తండ్రి, విలన్, తాత, కమెడియన్ ఇలా ఎలాంటి పాత్ర అయినా కైకాల ఒదిగిపోయే తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో తన కెరీర్ లో ఎదురైన అనుభవాల గురించి చెప్పాడు కైకాల.

    ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ మొదలుకొని నేటితరం సినిమాల్లో..

    ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ మొదలుకొని నేటితరం సినిమాల్లో..

    పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో తనదైన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నాడు కైకాల. ఆ నాడు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ మొదలుకొని చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి అగ్ర కథానాయకులతో పాటు నేటితరం సినిమాల్లో కూడా ఆయన నటిస్తున్నారు. అయితే కొన్ని సినిమాల్లో ప్రతినాయకుడిగా ఆయన పోషించిన కొన్ని పాత్రలపై ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యేవారో కైకాల చెప్పుకొచ్చాడు.

    విలన్ కైకాల.. ఆడవాళ్ళలో ద్వేషం

    విలన్ కైకాల.. ఆడవాళ్ళలో ద్వేషం

    అప్పట్లో ఎన్నో సినిమాల్లో విలన్ పాత్ర పోషించి కర్కశత్వానికి సింబల్ గా మారాడు కైకాల. రేప్ సీన్లు, ఆడవాళ్లను హింసించే సన్నవేషాల్లో కైకాల ఒదిగిపోయి నటించేవారు. దీంతో ఆ రోజుల్లో ఆడవాళ్లు కైకాల అంటే బాగా అసహ్యించుకునేవారట. సినిమాను బాగా ఆదరించే నాటి ఆడవాళ్లు ఆ సినిమాల్లో కైకాల క్యారెక్టర్‌పై కోపంగా ఉండేవారట. ఆ టైమ్‌లో కైకాలను చంపేయాలన్నంత కోపం వారిలో ఉండేదట.

    ‘రేప్‌'ల నారాయణ.. వెనక నుంచి పొడిచేయాలి

    ‘రేప్‌'ల నారాయణ.. వెనక నుంచి పొడిచేయాలి

    ఈ నేపథ్యంలో ఓ సారి పబ్లిక్ ఈవెంట్ కి వెళ్లగా.. అక్కడున్న ఆడవాళ్లలో ఒకామె.. ఆ సత్తిగాడిని వెనక నుంచి పొడిచేయాలి అనేసిందట. ఇంకో ఆమె 'ఎందుకయ్యా! ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావు. నీకు అక్కాచెల్లెళ్లు లేరా అని నిలదీసిందట. ఈ విషయాలు నెమరు వేసుకుంటూ నవ్వుకున్నారు కైకాల సత్యనారాయణ. అప్పట్లో తనని ‘రేప్‌'ల నారాయణ అనే వారని కూడా కైకాల చెప్పాడు.

    నవరస నటనా సార్వభౌమ.. కైకాల

    నవరస నటనా సార్వభౌమ.. కైకాల

    తెలుగు సినీ నటుడుగా ఫేమస్ అయిన కైకాల సత్యనారాయణ ఆ తర్వాత భారత పార్లమెంటు సభ్యుడుగా కూడా ఎన్నికయ్యాడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా దాదాపు 777 సినిమాల్లో నటించాడు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు.

    English summary
    Kaikala Satyanarayana is a former TDP parliamentarian, film actor, producer and director in Telugu cinema. In latest interview he tells about his career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X