twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kaikala Satyanarayana: చిరంజీవితో నట దిగ్గజం కైకాల సత్యనారాయణ.. నెట్టింట్లో ఆఖరి వీడియో వైరల్!

    |

    శ్రీకృష్ణుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ పేరు ఎలా చెబుతామో.. యముడు అంటే ఎవరికైన ముందుగా గుర్తు వచ్చేది లెజండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ డిసెంబర్ 23 అంటే ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తెలుగు స్టార్ హీరోలందరితో ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. తాజాగా కైకాల సత్యనారాయణ కనిపించిన ఆఖరి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    నేలకొరిగిన మరో నట శిఖరం..

    నేలకొరిగిన మరో నట శిఖరం..

    తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనేక మంది సినీ ప్రముఖులు తుది శ్వాస విడిచారు. మరీ ముఖ్యంగా ఈ రెండు మూడు నెలల వ్యవధిలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, నట శేఖర కృష్ణ వంటి దిగ్గజ నటులను పరిశ్రమ కోల్పోయింది. దీంతో చిత్ర రంగానికి తీవ్ర లోటు ఏర్పడింది. ఇప్పుడు మరో నట శిఖరం నేలకొరిగింది. దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా టాలీవుడ్‌లో నటుడిగా తన సత్తా చాటి లెజెండరీ యాక్టర్‌గా పేరొందిన కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

    సినిమాలపై ఇంట్రెస్ట్ తో స్టేజ్ ప్రోగ్రామ్స్..

    సినిమాలపై ఇంట్రెస్ట్ తో స్టేజ్ ప్రోగ్రామ్స్..

    సిపాయి కూతురు అనే చిత్రంలో తొలిసారిగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన కైకాల సత్యనారాయణ 1935లో కృష్ణా జిల్లా, కౌతవరం మండలం, గుడ్ల వల్లేరులో జన్మించారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, కుమారులు ఉన్నారు. సినిమాల మీద ఉన్న మక్కువతో స్టేజ్ ప్రోగ్రామ్‌లలో నటించి మెప్పించిన కైకాల సత్యనారాయణ.. ఆ తర్వాత మద్రాసు వెళ్లారు. ఈ క్రమంలోనే నటుడిగా ప్రయాణాన్ని మొదలెట్టి.. పెద్ద పెద్ద స్టార్లతో పోటీగా నటించి మెప్పించారు.

    యముడిగా చెరగని ముద్ర..

    యముడిగా చెరగని ముద్ర..

    పౌరాణికం, జానపదం, కమర్షయిల్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన జోనర్స్ లో తనదైన స్టైల్ లో నటనతో ముద్ర వేసుకున్నారు కైకాల సత్యనారాయణ. సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణ హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, సోపోర్టింగ్ రోల్స్ తో తనకు తానే సాటి అనిపించుకున్నారు. అంతకుమించి యముడు అంటే తెలుగు ఇండస్ట్రీలో కైకాల సత్యతనారాయణ తర్వాతే ఎవరైనా అనేంతగా పేరు సపాదించుకున్నారు.

    అంత్యక్రియలు ఎప్పుడంటే..

    అంత్యక్రియలు ఎప్పుడంటే..

    ప్రస్తుతం కైకాల సత్యనారాయణ మరణంతో తెలుగు చిత్ర సీమలో విషాదం నెలకొంది. మరణ వార్త ఇటు సినీ పరిశ్రమలోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర విషాదాన్నే నింపింది. ఇక, ఆయన భౌతిక కాయాన్ని ఇంటి దగ్గరే ఉంచుతారని తెలిసింది. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం ఫిలిం చాంబర్‌కు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, కైకాల అంత్యక్రియలు శనివారం ఉదయం జరుగుతాయని టాక్ వినిపిస్తోంది.

    చివరిగా చిరంజీవితో..

    చివరిగా చిరంజీవితో..

    ఇదిలా ఉంటే కైకాల సత్యనారాయణ చివరిగా కనిపించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే ఆస్పత్రి తరహా సెటప్ తో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కైకాల సత్యనారయణ పుట్టినరోజు అయిన జూలై 25న ఆయన్ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. కైకాల నివాసానికి వెళ్లి స్వయంగా కేక్ కట్ చేయించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇదే కైకాల సత్యనారయణను ప్రపంచానికి చివరిగా చూపించిన వీడియో అని నెటిజన్లు భావిస్తున్నారు.

    English summary
    Tollywood Senior Actor Kaikala Satyanarayana passed away on Friday at his Hyderabad residence due to Health Issues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X