సచిన్‌పై పాటే పాట ఉద్వేగ భరితంగా ఉంటుంది
లండన్: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సాధించిన వందవ సెంచరీ ఘనతను పురస్కరించుకోని బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్ ఓ పాటను కంపోజ్ చేయనున్నాడు. మార్చి 18వ తేదీన సచిన్ తన చారిత్రాత్మక అంతర్జాతీయ వందో సెంచరీని బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న షేర్ ఈ బంగ్లా అంతర్జాతీయ స్డేడియంలో బంగ్లాదేశ్‌పై నమోదు చేసిన విషయం తెలిసిందే. సచిన్ సెంచరీ సాధించిన తర్వాత సచిన్‌ను ఢాకాలో కైలాష్ ఖేర్ మర్యాద పూర్వకంగా కలిశాడు.
ఈ సందర్బంలో కైలాష్ ఖేర్ మాట్లాడుతూ సచిన్‌పై రూపొందుతున్న పాట ఉద్వేగభరితంగా ఉంటుందని... భారత దేశం అందించిన ఉత్తమ క్రికెటర్లలో సచిన్ ఒకడని తెలిపాడు.
రంగేలీ ఆల్బమ్ ప్రమోషన్‌లో భాగంగా కైలాష్ భారత్‌లో ఉన్న ప్రధాన పట్టణాలతో పాటు ఇండోనేషియా, బాలీలో పర్యటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











