అల్లు అర్జున్‌తో మంచి అవగాహన ఉండటం వల్లే...
హైదరాబాద్ : బన్నీతో ఇదివరకు 'ఆర్య 2' చేశాను. ఇప్పుడు ఈ సినిమా చేశాను. అతనితో మంచి అవగాహన ఉండటం వల్ల హ్యాపీగా పనిచేశాను. అది బాగా వర్కవుట్ అయ్యింది. అలాగే రామ్‌చరణ్, బన్నీ, దిల్ రాజు, వంశీ పైడిపల్లి అందరూ నాకు మంచి మిత్రులు. అందుకే ఈ అతిథి పాత్ర చేశాను. రామ్‌చరణ్ సినిమా 'ఎవడు'లో అల్లు అర్జున్ సరసన ఓ ప్రత్యేక పాత్రలో మెరిసింది. త్వరలో చరణ్ జోడీగా కృష్ణవంశీ సినిమా చేయబోతున్న ఆమె మీడియాతో మాట్లాడింది.
రెండేళ్ల క్రితమే ఎవడు కథను విన్నాను. బాగా నచ్చింది. వాస్తవానికి ఈ సినిమాలో శ్రుతి హాసన్ చేసిన కేరక్టర్‌ను చేయమని ముందు నన్నే అడిగారు. అయితే ఆ టైమ్‌లో కాల్షీట్ల సమస్య వల్ల దాన్ని చేయలేకపోయాను. అయితే ఆ సినిమాకి పనిచేయాలని నేను కోరుకున్నాను. అందుకే స్పెషల్ అప్పీరెన్స్ చేశా. పేరుకి గెస్ట్ రోల్ అయినా కథకు కీలకమైన పాత్ర. అది కూడా నాకు బాగా నచ్చింది అంది.

అలాగే ...రామ్‌చరణ్ కాంబినేషన్‌తో నేను చేసిన సినిమాలన్నీ ఆడాయి. అంటే మా కాంబినేషన్‌ను జనం ఇష్టపడుతున్నారు. అతనితో కలిసి మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ఇప్పుడు మరోసారి చరణ్‌తో కృష్ణవంశీ డైరెక్షన్‌లో చేయబోతున్నా. వచ్చే వారం నుంచే అది సెట్స్ మీదకు వెళ్తోంది. ఇందులో కాస్త రెబల్‌గా ఉండే కేరక్టర్ చేస్తున్నా. అది నాకు బాగా నచ్చింది. అలాగే అది నైస్ ఇంటరెస్టింగ్ స్టోరీ. అందులో భాగం కావడం ఆనందంగా ఉంది అంది.
ఇక "పారితోషికం సమస్య వల్ల తెలుగులో గ్యాప్ తీసుకున్నాననేది కేవలం రూమర్. పారితోషికం అనేది నాకెప్పుడూ సమస్య కాలేదు. నా పారితోషికంతో నిర్మాతలెవరూ ఇబ్బంది పడలేదు. అలా అయితే నేను తమిళంలో బిజీగా ఉండేదాన్ని కాదు కదా. తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం'' అని చెప్పింది కాజల్ అగర్వాల్.


Click it and Unblock the Notifications











