బిజినెస్ హైప్ కోసమే ఆ సీన్: కాజల్
'బిజినెస్ మ్యాన్' చిత్రంలో మహేష్‌తో లిప్‌లాక్ వేశాను. కేవలం బిజినెస్ హైప్ కోసం పూరి చేయించారు అంటోంది కాజల్. ఆమెను బిజినెస్ మ్యాన్ చిత్రంలో లిప్ లాక్ సీన్ గురించి అడిగినప్పుడు ఇలా స్పందించింది. బిజినెస్ మ్యాన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె చాలా విషయాలు చెప్పింది. ఆమె మాటల్లో..సూర్య భాయ్ ప్రేయసి చిత్రగా మీ ముందుకొచ్చాను. తండ్రి ప్రేమకు, ప్రియుని ప్రేమకు మధ్య నలిగిపోయే అమ్మాయిగా నా నటన కొత్తగా ఉందంటున్నారంతా. పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధాంక్స్ అంది. అలాగే మహేష్ ఓ స్వీట్ కోస్టార్. సూపర్‌స్టార్ అయినా చాలా అణకువ ఉన్న హీరో. సూర్యభాయ్‌గా అదరగొట్టాడు. చిత్ర ఓ పెయింటర్. చాలా ట్రెండ్లీ గర్ల్. పైగా తండ్రిచాటు బిడ్డ. నాన్నంటే తనకి చాలా ఇష్టం. అనుకోకుండా బిజినెస్‌మేన్‌తో ప్రేమలో పడుతుంది.
ఆ తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణలో నలిగిపోతుంది. నా గత పాత్రలతో పోలిస్తే పూర్తి వైవిధ్యమైన పాత్ర ఇది. అలాగే ఈపూరి చాలా స్పష్టత ఉన్న దర్శకుడు. అందరినుంచి నటన బాగా రాబట్టుకున్నారు. నా సినిమాని దుబాయ్‌లో ఓసారి, ముంబైలో ఓసారి చూసుకున్నా. చాలా చాలా నచ్చేసింది. అందరికీ నచ్చినట్టే..సారొచ్చారు పాట బాగా ఇష్టం. నా కుటుంబ సభ్యులు కూడా ఈ సినిమాని బాగా ఆస్వాధించారు అన్నారు. హిందీ 'బిజినెస్‌మేన్', 'బిజినెస్ మ్యాన్ 2' రెండిటిలో పూరి అవకాశమిస్తే తప్పక నటిస్తానని అన్నారు. ప్రస్తుతం తెలుగులో ప్రస్తుతం రామ్ చరణ్, వి.వి.వినాయక్ సినిమా, ఎన్టీఆర్, శ్రీనువైట్ల సినిమా చేస్తున్నా. ఇక తమిళంలో సూర్య 'మాట్రాన్' సహా విజయ్‌తో ఓ చిత్రంలో చేస్తున్నా. హిందీ సినిమా మార్చిలో సెట్స్‌కెళ్లనుంది అంది.


Click it and Unblock the Notifications











