అడ్డదారులు తొక్కాల్సిన పనిలేదు: కాజల్
'నా అందాల ప్రదర్శన ఎప్పుడూ హద్దుల్లోనే ఉంది. చిన్ని చిన్ని దుస్తుల్లోనే గ్లామర్ ఉంటుందని నేను నమ్మను. అవి వేసుకోకపోయినా నేను అందంగానే ఉంటాను. నిండైన చీరకట్టులో చాలా సినిమాల్లో కనిపించాను. నా అందంపై నాకెప్పుడూ సందేహం లేదు. అనుమానం ఉన్నవారే వేరే దారుల్లో ప్రయాణిస్తారు'' అంటోంది కాజల్. ఆమె ఈ మధ్య కాస్త శ్రుతి మించి మరి అందాల ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మీడియా వారు ఆమెను అడిగితే ఆమె ఇలా స్పందించింది. అలాగే ...''నీ నవ్వే నీకు అందం అని మా అమ్మ నాతో ఎప్పుడూ చెబుతుంటుంది. అమ్మ కంటికి బిడ్డలు ఎప్పుడూ అందంగానే కనిపిస్తారు. అయితే నా స్నేహితులు కూడా అదే మాట చెబుతుంటారు'' అంది కాజల్.
ఇక 'బిజినెస్‌మేన్' సినిమాతో మళ్లీ తన పూర్వ వైభవం సంపాదించుకున్న కాజల్ వరసగా తెలుగు, తమిళంలో అవకాశాలు అందుకొంటోంది. కాజల్ రీసెంట్ గా ఓ హిందీ చిత్రం కమిటైంది. ఆ చిత్రం కాన్సెప్ట్ వాస్తవ సంఘటన నేపధ్యంలో రూపొందిస్తున్నారు. 1987 నాటి ఒక వాస్తవ ఘటన ఆధారంగా 'ఎ వెన్స్‌డే' ఫేం దర్శకుడు నీరజ్ 'స్పెషల్ ఛబ్బిస్' పేరిట ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ముంబైలోని త్రిభువన్‌దాస్ భీమ్‌జీ జువెలర్స్ ఒపెరా హౌస్ శాఖపై పట్టపగలు జరిగిన ఒక దోపిడీ ఘటన ఈ చిత్రానికి ఇతివృత్తమని తెలిసింది. సిబిఐ ఆఫీసర్ ముసుగులో మోన్ సింగ్ అనే వ్యక్తి 26 మంది సాయంతో ఈ దోపిడీకి పాల్పడ్డాడు. ఇక ప్రస్తుతం ఆమె తెలుగు సినిమా స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ, పవన్ కళ్యాణ్ లోనూ, కోలీవుడ్ స్టార్స్ సూర్య, విజయ్‌లతో ఈ ఉత్తరాది భామ ఒక్కో సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలోనూ ఆమె ఆచి తూచి ఆఫర్స్ ని ఎంచుకుంటోంది.


Click it and Unblock the Notifications











