కొన్ని తప్పులు చేశా... సిగ్గుపడను: కాజల్ అగర్వాల్
హైదరాబాద్: నటిగా ఎదిగే క్రమంలో కొన్ని తప్పులు చేశా. నా సినిమాలు చూసుకొంటే నాకే నవ్వొస్తుంది. 'ఇలా చేశానేంటి' అనిపిస్తుంది. అలాగని సిగ్గుపడను. ఎందుకంటే తప్పులు చేయకపోతే నేర్చుకొనే అవకాశం ఎప్పుడొస్తుంది? పరీక్షల్లో అన్నీ సరైన సమాధానాలే రాయం కదా? చిన్నప్పటి ఫొటోలు ఎలాగున్నా సరే. అరుదైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలా ఉన్నానేంటి? అనుకోం. చేసేసిన సినిమాలూ అంతే అంటూ చెప్పకొచ్చింది కాజల్. ఆమె తాజా చిత్రాలు నాయక్, బాద్షాల బిజీలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుత ఇలా స్పందించింది.
''నటన అంటే డైలాగులు అప్పజెప్పడం, కెమెరా ముందు అటూ ఇటూ నడవడం అనుకొనేదాన్ని. కథనీ, పాత్రనీ అర్థం చేసుకొని ప్రవర్తించడం అని అనుభవపూర్వకంగా తెలుసుకొన్నా'' అంది కాజల్. అలాగే నటిగా ఏం సాధించారు? అని అడిగితే'' అన్నింటికంటే ముఖ్యంగా ఎలా నటించాలో, ఎలా నటించకూడదో తెలుసుకొన్నా. నేనేం మోడలింగ్ నుంచి రాలేదు. ఇక్కడికి వచ్చే వరకూ కెమెరా ముందు ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదు. సినిమాలే ఒక్కోటీ నేర్పాయి అంది.
ఇక నాపై ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా గురించి వస్తున్న రూమర్స్ ని ఎవరూ నమ్మొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తోంది కాజల్. దీపావళికి విడుదలైన 'తుపాకి' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం దీనిని హిందీలోకి రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు ఏఆర్ మురుగదాస్. అక్షయ్ కుమార్ హీరో. హీరోయిన్ గా కాజల్ పేరు ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని కాజల్ కొట్టిపారేస్తూ ఆమె ఇలా స్పందించింది. 2012లో సూర్య సరసన 'బ్రదర్శ్', విజయ్‌తో 'తుపాకి' చిత్రాల్లో నటించి తమిళ, తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన హీరోయిన్ కాజల్. ఒక సినిమా కాస్త నిరాశ పరిచినా.. రెండోది మాత్రం అమ్మడి స్థాయిని నిలిపింది.
ఇక కాజల్ నటించిన 'నాయక్' ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ 2013 వేసవిలో 'బాద్‌షా'తో వేడిక్కించనుంది. అంతేగాక వాస్తవ సంఘటన నేపధ్యంలో రూపొందుతున్న హిందీ చిత్రంలో కాజల్ చేస్తోంది. 1987 నాటి ఒక వాస్తవ ఘటన ఆధారంగా 'ఎ వెన్స్‌డే' ఫేం దర్శకుడు నీరజ్ 'స్పెషల్ ఛబ్బిస్' పేరిట ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ముంబైలోని త్రిభువన్ దాస్ భీమ్‌జీ జువెలర్స్ ఒపెరా హౌస్ శాఖపై పట్టపగలు జరిగిన ఒక దోపిడీ ఘటన ఈ చిత్రానికి ఇతివృత్తమని తెలిసింది. సిబిఐ ఆఫీసర్ ముసుగులో మోన్ సింగ్ అనే వ్యక్తి 26 మంది సాయంతో ఈ దోపిడీకి పాల్పడ్డాడు.


Click it and Unblock the Notifications











