twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దడ'ని కాజల్ వెటకారం చేస్తోందా?

    By Srikanya
    |

    రీసెంట్ గా విడుదలైన కాజల్ చిత్రం 'దడ'. ఈ చిత్రంలో ఆమె రియా పాత్రను పోషించింది. సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటమే కాక ఆమె పాత్ర విమర్శల పాలైంది. అది దృష్టిలో పెట్టుకునే మీడియావారు ఆమెను 'దడ' చిత్రం గురించి అడిగితే... ''నేను ఇప్పటి వరకూ చేసిన పాత్రలన్నింటికంటే 'దడ' చిత్రంలో రియా పాత్ర ప్రత్యేకమైంది. నా ఆహార్యం భిన్నంగా ఉంటుంది అంది. ఇది విన్న వారు ఆమె కావాలనే వెటకారం చేస్తూ ఆమె పాత్ర గురించి చెప్తోందా అని సందేహపడుతున్నారు. అయితే ఆమె అతితెలివిగా దర్శక,నిర్మాతలను నొప్పించకుండా చెప్తోందా అనేది టాపిక్ గా మారింది.

    ఇక నాగచైతన్యతో అమె షూటింగ్ సమయంలో తగువులు పడిందని, చైతూని ఆమె లెక్కచేయలేదని విషయాన్ని ప్రస్దావిస్తే... షూటింగ్ సమయంలో నాగచైతన్య ఎంతో స్నేహపూర్వకంగా మెలిగేవారు. ఆయనలో నాకు నచ్చింది నిజాయితీ అని కవర్ చేసింది.అంతేగాక తెలుగులో నా తొలి చిత్రం 'లక్ష్మీకల్యాణం' నుంచి 'దడ' వరకూ నా సినిమా ప్రయాణంలో ప్రతీది మర్చిపోలేని అనుభూతే. ఈ క్రమంలో గొప్ప వ్యక్తులను కలుసుకునే అవకాశం వచ్చింది. వారి నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది. కాజల్ మొత్తానికి భలే తెలివైందే అంటున్నారు ఈ మాటలు విన్నవారంతా.

    English summary
    Dada’s failure has left Kajal Agarwal in doldrums due to the criticism that her character is getting. Everything including her makeup, styling, dubbing and performance is being criticized.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X