మగధీరలో కాజల్ క్యారక్టర్

ఇక చెన్నైలో పుట్టిన ఈ ముధ్దుగుమ్మ ముంబైలో పెరిగింది. దాంతో భాష తెలియని తెలుగులో నటించటం కష్టమనిపించలేదా అంటే..ధియోటర్ బ్యాక్ గ్రౌడ్ నుంచి రావటంతో నాకు భాష ఇబ్బంది లేదు. నా డైలాగులును నేను ఇంగ్లీషులో రాసుకుంటును. అలాగే ప్రొపిషనల్స్ తో పనిచేయటం కలిసి వచ్చే అంశం అంటోంది. హీరోయిన్స్ అంతా బికినీ వేసుకుంటున్నారు మరి..మీరెప్పుడు అంటే నా బాడీ లాంగ్వేజ్ కి బికినీ పనికి రాదనుకుంటున్నాను. ప్రతీ కాస్ట్యూమ్ ప్రతీ ఒక్కరికి సరిపడదు. నాకు నిజానికి శారీలంటే ఇష్టం అంది. ఇక సినిమా ఒప్పుకునే ముందు నా పాత్ర,పూర్తి స్క్రిప్టు, బ్యానర్,డైరక్టర్, కో స్టార్స్ పరిశీలుంచుకుంటాను అంది.
రాజస్ఠాన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పునర్జమన్మ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. శ్రీహరి సైతం ఈ చిత్రంలో కీలకమైన పాత్ర చేసారని వినికిడి. గీతా ఆర్ట్స్ పై గజనీ తర్వాత ఎక్కువ బడ్జెట్ లో నిర్మితమైన చిత్రం ఇదేనని తెలుస్తోంది.ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం రామ్ చరణ్ అభిమానులునే కాక అందరినీ అలరించే అవకాశముందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











