twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ఒట్టి అల్లరి..కాజల్

    By Srikanya
    |

    ఆర్య-2 లో బన్నీ(అల్లు అర్జున్) సరసన చేసిన కాజల్ ,సెట్లో అతని ప్రవర్తన గురించి మాట్లాడుతూ ఈ విషయం చెప్పుకొచ్చింది. అటు రామ్‌ చరణ్‌ తో మగధీరలోనూ..ఇటు అల్లు అర్జున్‌ తో ఆర్య 2 లోనూ జోడీ కట్టేసి మెగా హీరోయిన్‌ అనిపించుకున్నారు...కదా మీ కామెంట్ ఏమిటీ అంటే...నిజమే! 'మగధీర' సాధించిన రికార్డుల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. ఇక 'ఆర్య 2' కథంతా ఇంచుమించు నా(గీత) పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇక సెట్లో రామ్‌చరణ్‌ ఎంత బుద్ధిగా ఉంటాడో...బన్నీ అంత అల్లరి చేస్తాడు. వారితో చేసిన సినిమాలు నా కెరీర్‌ లో తీయని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అంటోంది.

    ఇక ఆమె లేటెస్ట్ చిత్రం 'ఓం శాంతి'లో తన పాత్ర గురించి మాట్లాడుతూ..అందులో మరో ముగ్గరు హీరోయిన్స్ ఉన్నా నేనే అసలు హీరోయిన్ ని అంది నవ్వుతూ. ఎందుకంటే ఈ సినిమాలో నేను నిజ జీవిత పాత్ర పోషిస్తున్నాను. అంటే నేను హీరోయిన్‌ గా కనిపిస్తాను. పేరు మేఘన. కాబట్టి ఈ సినిమాలో నేనే సిసలైన హీరోయిన్ ను నేనే అంది. అలాగే ఈ చిత్రంలో మేఘన ఏం చేస్తుంది అనేదానికన్నా...మేఘన ప్రవర్తన ఏంటి అనేదే ముఖ్యం. ప్రతిదీ కొత్తగా ఆలోచిస్తుంది. నలుగురూ ఓ దారిలో వెళితే తనో దారి వెతుక్కుంటుంది. భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. 'ఓం శాంతి'లో ఐదు పాత్రలుంటాయి. అన్నీ కీలకమైనవే అంటూ వివరించింది. 'ఓం శాంతి' చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X