బందీ అయ్యేందుకు రెడీగా లేను : కాజల్
హాలీవుడ్, బాలీవుడ్ నాయికల్లో ఎక్కువశాతం మంది 35 ఏళ్ల తర్వాతే వివాహం చేసుకుంటారు. వారితో పోల్చితే నాకింకా పెళ్లి వయసు రాలేదనే చెప్పాలి! 'తుపాకి' తర్వాత మళ్లీ విజయ్‌తో నటించటంపై అడుగుతున్నారు. మాది విజయవంతమైన జంట. తాజాగా ఆయనకు జోడీగా 'జిల్లా'లో కనిపిస్తున్నాను. మరిన్ని చిత్రాల్లో ఆయనతో కలిసి నటించేందుకుద సిద్ధంగా ఉన్నానని చెప్పింది.
తెలుగు, తమిళ భాషలతోపాటు హిందీలోనూ అవకాశాలు అందుకొంటోందీ భామ. ఉత్తరాదిన 'సింగమ్', 'స్పెషల్ ఛబ్బీస్'లాంటి చిత్రాలతో విజయాల్ని సొంతం చేసుకొంది. తెలుగులో రామ్‌చరణ్ నటిస్తున్న 'ఎవడు'లో ఓ అతిథి పాత్రతో సందడి చేయబోతోంది.
హిందీలో నటించాక ఓ హీరోయిన్ గా మీ తీరులో మార్పేమైనా కనిపిస్తోందా అని అడిగితే ''ఒక్కో భాషలో ఒక్కోలా నటించాలనే సిద్ధాంతమేదీ నాకు లేదు. నాకు నేనుగా కొన్ని పరిమితుల్ని విధించుకొని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. అందుకు అనుగుణంగానే ప్రయాణం సాగిస్తున్నాను. ఏ భాషలోనైనా నా తీరు ఒకేలా ఉంటుంది. తెలుగు సినిమాలో ఎలా నటించానో హిందీలో కూడా అదే తరహాలోనే నటించాను. అయితే అనుభవం పెరిగే కొద్దీ నా నటనలో నాకు పరిణతి కనిపిస్తోంది. ఈ హోదానిచ్చిన ప్రేక్షకుల కోసం ఇంకా ఏదైనా కొత్తగా చేయాలనిపిస్తుంటుంది''అని చెప్పుకొచ్చింది. ఈ రోజు (బుధవారం) కాజల్ పుట్టిన రోజు. ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications












