కావాలని ఆ హీరోలని బాధ పెట్టలేదు: కాజల్
హిట్ సినిమా తర్వాత చేయబోయే చిత్రాలు కూడా నా స్థాయిని పెంచే విధంగా ఉండాలి కానీ తగ్గించే విధంగా ఉండకూడదు. అందుకే కొన్ని చిత్రాలు వదులుకున్నాను. దీనివల్ల ఏ హీరో అయినా బాధపడి ఉండొచ్చు. అయితే కావాలని నేను ఎవరినీ బాధపెట్టలేదు. మొహమాటం కోసం సినిమాలు ఒప్పుకుని ప్రేక్షకులను నిరాశపరచలేను అని తేల్చి చెప్పిది కాజల్. ఆమె రీసెంట్ గా తన సిని ప్రస్దానం గురించి మాట్లాడుతూ ఇలా స్పందించింది. తాను కొన్ని సినిమా కథలు విని వద్దన్నాను అని..అయితే దానికి వేరే కారణాలు ఉన్నాయని అంది.
ఇక డబ్బే ప్రధానం అనో, వీలైనన్ని సినిమాలు చేసేసి త్వరగా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచేసుకుని సినిమాల నుంచి తప్పుకుందామనో నేనిక్కడికి రాలేదు. 'కాజల్ మంచి నటి' అనిపించుకోవాలనే ఏకైక లక్ష్యంతో వచ్చాను. అందుకే పాత్రల ఎంపిక పరంగా నేను చాలా కేర్ తీసుకుంటున్నాను అంది. ప్రస్తుతం ఆమె మహేష్‌బాబు, సూర్య, రామ్ చరణ్... ఇలా స్టార్ హీరోల సరసన జతకడుతూ, హీందీలో అక్షయ్‌కుమార్ సరసన 'స్పెషల్ చబ్బీస్' మాత్రమే అంగీకరించింది. ఇక నేను చేసినవాటిల్లో కొన్ని ఫ్లాప్ అయినవి కూడా ఉన్నాయి. అయితే ఏ చిత్రంలోనూ కాజల్ బాగా యాక్ట్ చేయలేదు అనే విమర్శ మాత్రం రాలేదు. హిందీలో కూడా ఆ విమర్శ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉందని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











