ఎన్టీఆర్ గురించి కాజల్ అగర్వాల్ కామెంట్
హైదరాబాద్: ఎన్టీఆర్‌తో ఇది నాకు రెండో సినిమా. తను చక్కని సహ నటుడు. అతనితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. బాగా కష్టపడే తత్త్వమున్న మనిషి. స్నేహంగా మెలగుతారు. సీన్ చేసేప్పుడు కామిక్ టైమింగ్ విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. అందువల్లే ఆయన సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ అంతగా పండుతుంది అంది. రీసెంట్ గా 'బాద్‌షా' తో హిట్ కొట్టిన కాజల్ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది.
అలాగే 'బాద్‌షా' ఘన విజయం సాధించినందుకూ, అందులో నేను చేసిన జానకి పాత్ర ఆదరణ పొందినందుకూ చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నింటిలో ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న కేరక్టర్ ఇది. నటించేప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేశా అంది.
ఇక తనకు రీమేక్స్ లో నటించటం ఇష్టం లేదంటోంది. ఆమె మాట్లాడుతూ... "నాకు మరొకరు చేసిన పాత్రల కంటే ఒరిజినల్ కేరక్టర్లు చేయడమే ఇష్టం. అందుకే రీమేక్స్‌ని నేను ఇష్టపడను. ఒకవేళ అలాంటి ఆఫర్లు వస్తే చేయాలో, వద్దో అప్పటి సందర్భాన్ని బట్టి నిర్ణయించుకుంటా'' అని చెప్పింది.
ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టుల గురించి చెప్తూ... తెలుగులో రామ్‌చరణ్ సినిమా 'ఎవడు'లో ప్రత్యేక పాత్ర చేస్తున్నాను. అందులో అల్లు అర్జున్ జోడీగా కనిపిస్తా. అతనిదీ స్పెషల్ అప్పీరెన్సే. తెలుగులో కొత్తగా ఇంకా ఏ సినిమాకీ కమిట్ కాలేదు. తమిళంలో కార్తీతో 'ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా', విజయ్‌తో 'జిల్లా' చేస్తున్నా. 'స్పెషల్ 26' తర్వాత బాలీవుడ్‌లోనూ ఆఫర్లు వస్తున్నాయి. అవి చర్చల దశలో ఉన్నాయి అంది.


Click it and Unblock the Notifications











