twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగచైతన్యవి టీజ్ చేసానని ఒప్పుకుంది

    By Srikanya
    |

    నాగచైతన్యకి,కాజల్ కి మధ్య గొడవలు వస్తున్నాయని,కాజల్ అథన్ని జూనియర్ అనే ఉద్దేశ్యంతో పట్టించుకోవటంలేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.దడ చిత్రం షూటింగ్ సమయంలో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి.అయితే అవేమీ నిజం కాదని వీరిద్దరూ ఇంతకు ముందు ఖండించారు.అయితే తాజాగా కాజల్ ఈ విషయం కరెక్టేనని మీడియా వద్ద ఒప్పుకుంది.ఆమె ఈ విషయమై మాట్లాడుతూ.. చైతన్య ఆర్టిస్ట్‌గా నాకు జూనియర్ అయినందు వల్ల లొకేషన్లో బాగా టీజ్ చేసేదాన్ని. తను కూడా చాలా సరదగా ఉండేవాడు. అతనికి కాస్త సిగ్గెక్కువ. కాస్త ముభావంగా ఉంటాడు అంది.ఆ సిగ్గు,ముభావం పోగొట్టడానికే అలా బిహేవ్ చేసానన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.అయితే అంత సిగ్గుగా ఉన్నా కెమెరా ముందుకెళితే చెలరేగిపోతాడు. మా కాంబినేషన్ చూడముచ్చటగా ఉందని అందరూ అంటున్నారు. కామాక్షి సంస్థలో నటించడం గర్వంగా ఫీలవుతున్నాను అని చెప్పుకొచ్చింది.

    నాగచైతన్యతో కలిసి నటించిన 'దడ"గురించి చెపుతూ..నా గత చిత్రాలతో పోలిస్తే 'దడ" ప్రత్యేకమైన సినిమా. ఈ పాత్రలో ఎన్నో భావోద్వేగాలున్నాయి. దూరమైన తల్లి కోసం ప్రతి నిమిషం తపించే ఓ మనసున్న అమ్మాయి పాత్ర చేశాను. కనిపించడానికి ట్రెండీగా, మోడరన్‌గా ఉన్నా... అంతర్లీనంగా ఏదో తెలియని ఆవేదన ఉంటుందా పాత్రలో. స్వతహాగా నాకు మా అమ్మ అంటే ఇష్టం. అలాంటి నేను తల్లికి దూరమైన అమ్మాయిగా నటించడానికి చాలా కష్టపడ్డాను. ఇప్పటివరకూ నేను నటించిన సినిమాల్లో ఎక్కువభాగం ఫారిన్‌లో రూపొందిన సినిమా ఇదే. ఫిలిప్సీన్స్, బ్యాంకాక్, ఆస్టేలియాల్లో జరిగిన షూటింగ్ నాకు మరచిపోలేని అనుభూతినిచ్చింది. ప్రేక్షకులకు ఈ సినిమా ఓ విజువల్ ట్రీట్. జ్ఞానశేఖర్ అద్భుతమైన కెమెరా పనితనం చూపించాడు. అజయ్ టేకింగ్ స్టైల్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం... ఇలా చెప్పుకుంటే పోతే ప్రతి ఒక్క టెక్నీషియన్ ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పనిచేశారు.

    English summary
    Rumors were doing round that Naga Chaitanya and Kajal Agarwal had a fight in the sets of Dhada. It was also reported that Kajal tried to slap Chaitanya when they were in a heated argument.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X